https://oktelugu.com/

నో అపాయింట్‌మెంట్‌..: అఖిల ప్రియను దూరం పెట్టిన బాబు

ఎవరు ఎన్ని తప్పులు చేసినా తన అనుకున్న వారిని చంద్రబాబు ఎప్పుడూ వెనకేసుకొస్తుంటారు. అలాంటి చంద్రబాబు.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో ఎందుకో సైలెంట్‌ అయిపోయారు. ఇప్పటివరకు అఖిల ప్రియ ఎపిసోడ్‌పై ఎలాంటి కామెంట్లు చేయలేదు. కనీసం ఆ పార్టీ నాయకుడు ఎవరు కూడా ఆ టాపిక్‌ను తీయలేదు. బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత కూడా ఆమెను పరామర్శించిన పాపాన పోలేదు. Also Read: నిమ్మగడ్డకు ఊహించని షాక్‌ అఖిలప్రియ ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయింది. అందులోనూ ప్రస్తుతం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2021 / 02:12 PM IST
    Follow us on


    ఎవరు ఎన్ని తప్పులు చేసినా తన అనుకున్న వారిని చంద్రబాబు ఎప్పుడూ వెనకేసుకొస్తుంటారు. అలాంటి చంద్రబాబు.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో ఎందుకో సైలెంట్‌ అయిపోయారు. ఇప్పటివరకు అఖిల ప్రియ ఎపిసోడ్‌పై ఎలాంటి కామెంట్లు చేయలేదు. కనీసం ఆ పార్టీ నాయకుడు ఎవరు కూడా ఆ టాపిక్‌ను తీయలేదు. బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత కూడా ఆమెను పరామర్శించిన పాపాన పోలేదు.

    Also Read: నిమ్మగడ్డకు ఊహించని షాక్‌

    అఖిలప్రియ ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయింది. అందులోనూ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. అటు భర్త పరారీలో ఉన్నాడు.. ఇటు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో అఖిల ప్రియను పరామర్శించే బాధ్యత టీడీపీ నెత్తిన వేసుకోలేదు. అలా పరామర్శిస్తే తనకొచ్చే లాభం గురించే చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారా..? ఆళ్లగడ్డలో పూర్తిగా మరో వర్గాన్ని ప్రోత్సహించేందుకే పొమ్మనలేక అఖిలకు పొగపెట్టారా? వీటన్నిటికీ సమాధానాలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు పలువురు.

    ఇదిలా ఉంటే.. అఖిలప్రియ రిమాండ్‌లో ఉండగా.. ఆమె కుటుంబసభ్యులు సాయం కోసం చంద్రబాబుని కలిశారట. అయితే కనీసం మాట సాయం చేయడానికి కూడా ఆయన ససేమిరా అన్నారట. ఇక బెయిలుపై బయటకొచ్చిన అఖిల ప్రియ చంద్రబాబుని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారట. అయితే.. ఎప్పుడు ఫోన్ చేసినా అపాయింట్‌మెంట్ లేదంటూ కబుర్‌‌ వచ్చేదట. ధైర్యం చేసి నేరుగా కలిసే ప్రయత్నం చేస్తే.. చంద్రబాబు మొహం తిప్పుకుంటే పరువుపోతుందనే ఉద్దేశంతోనే అఖిల ప్రియ వెనకడుగేశారని సమాచారం.

    Also Read: ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?

    ముందస్తు బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో అఖిల ప్రియ భర్త ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. బెయిలు వస్తే ఆ తర్వాత తీరిగ్గా లొంగిపోవడానికి భార్గవ్ రామ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇదే విషయమై చంద్రబాబు సహాయం కోరేందుకు అఖిల ప్రియ ప్రయత్నించారని, అయితే ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్