https://oktelugu.com/

ఇంగువ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. సుగంధ ద్రవ్యాల వాడకం వల్ల వంటలకు రుచి, వాసన వస్తాయి. వందల సంవత్సరాల నుంచి వంటల్లో వాడుతున్న ఇంగువను అసఫోటిడా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంగువ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇంగువ అజీర్తి, కడుపు మంట సమస్యలకు చెక్ పెడుతుంది. Also Read: దోమలను ఇంటినుంచి తరిమికొట్టే చిట్కాలు ఇవే..? నీటిలో ఇంగువ ముక్కలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 02:23 PM IST
    Follow us on

    భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. సుగంధ ద్రవ్యాల వాడకం వల్ల వంటలకు రుచి, వాసన వస్తాయి. వందల సంవత్సరాల నుంచి వంటల్లో వాడుతున్న ఇంగువను అసఫోటిడా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంగువ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇంగువ అజీర్తి, కడుపు మంట సమస్యలకు చెక్ పెడుతుంది.

    Also Read: దోమలను ఇంటినుంచి తరిమికొట్టే చిట్కాలు ఇవే..?

    నీటిలో ఇంగువ ముక్కలను కరిగించి తీసుకుంటే ఋతుసమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస సంబంధిత అంటువ్యాధులను తగ్గించడంలో ఇంగువ సహాయపడుతుంది. సహజంగా జీవక్రియను మెరుగుపరచడంలో ఇంగువ తోడ్పడుతుంది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా నుంచి ఉపశమనం కోసం ఇంగువ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంగువ మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

    Also Read: పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    రక్తపోటు సమస్యతో బాధ పడేవాళ్లు ఇంగువను తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. తలనొప్పిని తగ్గించడంలో ఇంగువ సహాయపడుతుంది. గ్లాస్ వాటర్ లో ఇంగువ వేసుకుని తాగితే గ్యాస్, ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయి. ఇంగువ ముక్కను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే పంటి నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇంగువను కరిగించి తీసుకుంటే మైగ్రేన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    నరాలను ఉత్తేజితం చేయడంలో ఇంగువ సహాయపడుతుంది. ఇంగువ నాడీ సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పని చేసే ఇంగువ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. స్వచ్ఛమైన ఇంగువ ఘాటైన వాసనతో గోధుమ రంగులో ఉంటుంది.