Late Sleeping: నేటి కాలంలో మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. కంటినిండా నిద్రపోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే శరీరానికి పౌష్టికాహారం అందించినా.. సరైన నిద్రలేని కారణంగా ఆరోగ్యంగా ఉండలేరు. పది నిమిషాల కునుకుతో ఎంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాంటిది సమయానికి అనుకూలంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. అయితే చాలా కారణాలతో నేటి కాలంలో చాలామంది సరైన నిద్రపోవడం లేదు. ముఖ్యంగా రాత్రుళ్ళు ఎక్కువసేపు మెలకువతో ఉంటూ.. ఉదయం ఆలస్యంగా లేస్తున్నారు. ఇలా నిద్రపోయిన ఎలాంటి ఫలితం ఉండదు. రాత్రుల్లో ఎక్కువసేపు మెలకువతో ఉండి.. ఉదయం తొందరగా లేచిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అసలు ఒక మనిషి ఎన్ని గంటలు నిద్రపోవాలి? నిద్ర గంటలను భర్తీ చేయకపోతే ఏమవుతుంది?
Also Read: ఉత్సాహంగా పని.. ఆనందంగా జీవితం.. ఈ దేశాన్ని చూసి నేర్చుకోవాలి..
కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర గంటలను పూర్తి చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఈ నిద్ర గంటలు కూడా ఆరోగ్యంగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. కొందరు ఎక్కువసేపు నిద్రపోయినా కలత నిద్రతోనే ఉంటారు. ఇలా నిద్రపోయిన మానసికంగా ఆందోళనలతో ఉంటారు. అయితే రకరకాల కారణాలవల్ల ఎనిమిది గంటల పాటు నిద్రపోకుండా ఉండగలుగుతారు. ఇలా ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అంటే.?
సాధారణంగా ఒక రోజు పాటు నిద్ర లేకపోతే మనసు ఆందోళనగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. నిత్యం చికాకు కలుగుతూ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అయితే రోజు నిద్రించే గంటల్లో ఒక్క గంట తగ్గిన కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు సరైన నిద్ర చేయకపోవడం వల్ల మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో గంట నిద్రపోకుండా ఉంటే.. ఒక వారం పాటు ఎక్కువ గంటలు నిద్రపోనట్లే అవుతుంది. అంటే ఉదాహరణకు రోజు ఒక గంట నిద్ర తగ్గినా.. వారం రోజులకు 8 గంటల పాటు నిద్ర లేనట్లే. అంటే ఒక రోజంతా నిద్ర పోకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో..? వారం పాటు రోజుకో గంట నిద్రపోకుండా ఉంటే అలాంటి పరిస్థితులే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read: ఇంటికి దీపమే కాదు.. ఆదాయాన్ని పెంచేది కూడా ఇల్లాలే.. ఎలాగంటే?
అందువల్ల ఎన్ని పనులు ఉన్నా.. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోయే ప్రయత్నం చేయాలి. నేటి కాలంలో ఎన్నో రకాల ఒత్తిడితో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా నిద్రపోయే అవకాశం ఉండదు. కానీ మంచి నిద్ర పట్టాలంటే యోగా వంటివి సాధన చేయాలి. మైండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా నిద్రపోయే గంట ముందు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకుండా.. ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులు ఉన్నా.. వాటిని మరుసటి రోజుకు వాయిదా వేసి.. ఆరోజు మాత్రం సరైన నిద్ర పోయే ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో దీర్ఘకాలికంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.