World Preeclampsia Day 2025 : ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. ఒక వైపు, పిల్లల రాక ఆనందంగా ఉంటే, మరోవైపు, ఒక స్త్రీ 9 నెలలు అనేక మార్పుల ద్వారా ఈ గమ్యాన్ని చేరుతుంది. స్త్రీ మానసిక స్థితిలో హెచ్చుతగ్గుల నుంచి శరీర నొప్పి వరకు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది తన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో, తల్లి తన ఆరోగ్యంతో పాటు తన బిడ్డ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. తల్లి ఏమి తింటుందో, బిడ్డ కూడా దాని నుంచి పూర్తి పోషకాహారాన్ని పొందుతుంది. అయితే, చాలా సందర్భాలలో, గర్భధారణ సమయంలో మహిళలు అనేక వ్యాధులకు గురవుతారు. మధుమేహం నుంచి రక్తపోటు పెరుగుదల వరకు, ఇది సాధారణమైనదిగా పరిగణిస్తుంటారు. ఈ సమస్యలలో ప్రీక్లాంప్సియా కూడా ఒకటి. గర్భధారణ సమయంలో ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది. తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో స్త్రీ అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటుంది.
ప్రీక్లాంప్సియా సాధారణంగా గర్భం దాల్చిన 20వ వారం తర్వాత సంభవిస్తుంది తెలిపింది క్లీవ్‌ల్యాండ్ క్లినిక్. ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి అవగాహన మస్ట్. అందుకే ప్రతి సంవత్సరం మే 22న ప్రపంచ ప్రీక్లాంప్సియా దినోత్సవం 2025 జరుపుకుంటారు. ఈరోజు మనం ఈ వ్యాసంలో ఈ వ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : గర్భధారణ సమయంలో మలేరియా వస్తే ప్రాణాంతకమా?
ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో మహిళలు అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఇది. దీనినే హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. ఈ సమయంలో, మూత్రంలో అధిక స్థాయిలో ప్రోటీన్ రావడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను ప్రోటీన్యూరియా అంటారు. ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు, కాలేయం ఎక్కువగా దెబ్బతింటాయి. మొత్తంమీద, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం.
ప్రీక్లాంప్సియా లక్షణాలు
అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్, తీవ్రమైన తలనొప్పి, ఛాతీ నొప్పి, ముఖం – చేతుల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు సరిగా లేకపోవడం, పొత్తి కడుపు పైభాగంలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
ప్రీక్లాంప్సియాకు కారణమేమిటి
కుటుంబ చరిత్ర, అధిక రక్తపోటు, డయాబెటిస్, మూత్రపిండ వ్యాధి చరిత్ర, ఊబకాయం, హార్మోన్ల రుగ్మతలు వంటివి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
ఎలా గుర్తించాలి?
మూత్ర పరీక్ష ద్వారా, రక్త పరీక్ష ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. త్వరగా గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించడం సులభం అవుతుంది.
డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి?
ఈ వ్యాధి ప్రసవం తర్వాత కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, మీ మెదడు కూడా పనిచేయడం మానేయవచ్చు. మీరు గర్భవతిగా ఉంటే, ప్రీక్లాంప్సియా కూడా మీకు మూర్ఛ వ్యాధిని కలిగించవచ్చు. మూర్ఛ పదే పదే సంభవించవచ్చు. దీనివల్ల ప్లేట్‌లెట్స్ కూడా తగ్గుతాయి. మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. గర్భధారణ సమయంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి . నూనె, మసాలాలు ఎక్కువగా తినకండి. యోగా, వ్యాయామం చేయండి. ఉప్పును మితంగా తీసుకోండి.