Health: జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. మందులు వాడుతుంటారు. అయిన కూడా కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందలేరు. ప్రస్తుతం కొందరు నరాల బలహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మానవ శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. ఇవి బలహీనం అయితే అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. నరాలు ఆరోగ్యంగా లేకుండా బలహీనంగా ఉంటే మెమోరీ మందగించడం, కండరాలు బలం లేకపోవడం, తలనొప్పి ఎక్కువగా రావడం, తిమ్మిర్లు రావడం వంటి సమస్యలన్నీ వస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల తొందరగా నరాల సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అయితే నరాల సమస్యల నుంచి విముక్తి చెందడానికి తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏవో చూద్దాం.
ఆకుపచ్చని కూరగాయలు
కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. వీటితో పాటు ఆకు కూరలను కూడా ఎక్కువగా తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
సిట్రస్ పండ్లు
సిట్రిక్ ఆమ్లం ఉండే నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లను డైలీ తినడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీనివల్ల నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. దీంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
క్వినోవా
క్వినోవా రైస్‌ను తినడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఎక్కువగా జింక్, మాంగనీస్, ఫైబర్, కాపర్, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల బలహీనతను తగ్గిస్తాయి.
గుమ్మడి గింజలు
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీటిలో గుమ్మడి గింజలను తినడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా నరాలకు ఉపయోగపడే కాల్షియం, జింక్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
బ్లూబెర్రీలు
వీటిని డైలీ డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల నరాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి నరాల సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.