https://oktelugu.com/

Donald Trump : స్వింగ్ కింగ్‌ ట్రంపే.. తాజా సర్వేలో షాకింగ్‌ రిజల్ట్స్‌

అమెరికా అధ్యక్షలకు సమయం ఆసన్నమైంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో విడుదలైన ఓ సర్వే సంస్థ షాకింగ్‌ రిజల్ట్స్‌ను వెల్లడించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 5, 2024 / 02:16 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump :  అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్ని గంటల్లో జరుగనున్నాయి. పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ముందస్తు పోలింగ్‌లో ఇప్పటికే సుమారు 7 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ తరుణంలో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు విడుదలైన ఓ సర్వే ఫలితాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాజా సర్వేలో స్వింగ్‌ స్టేట్స్‌లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పుంజుకున్నట్లు వెల్లడిస్తునాయి. అట్లాస్‌ ఇంటెల్‌ తాజా పోల్స్‌ గణంకాలు వెల్లడించాయి. మొత్తంమీద 48 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారని, ఇది కమలా హారిస్‌కు లభించిన మద్దతుకన్నా 1.8 శాతం ఎక్కువ అని వెల్లడించింది. నవంబర్‌ 1, 2వ తేదీల్లో ఈ సర్వే చేసినట్లు తెలిపింది.

    స్వింగ్‌ స్టేట్స్‌లోనూ..
    ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన స్వింగ్‌ స్టేట్స్‌లో కూడా ట్రంప్‌కు మద్దతు పెరిగిందని తెలిపింది. బ్యాటిల్‌రాండ్‌ స్టేట్స్‌లోనే తన చివరి దశ పోలింగ్‌ ప్రచారం నిర్వహించారు. అమెరికా అద్యక్ష ఎన్నికల ఫలితాలను ఇవే శాసించనున్నాయి. ఇక స్వింగ్‌ స్టేట్స్‌గా పేరున్న ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నవెడా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్స్‌లో ట్రంప్‌ హవానే కొనసాగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఆరిజోనాలో 51.9 శాతం, నవెడాలో 51.4, నార్త్‌ కరోలినాలో 50.4 శాతం ట్రంప్‌కు మద్దతు లభించినట్లు తెలిపింది.

    మూడు రాష్ట్రాలే కీలకం..
    అమెరికా ఎన్నికల ఫలితాలను మూడ రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. వీటిని రెండ్, బ్లూ, స్వింగ్‌ స్టేట్స్‌గా పిలుస్తారు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తున్న వాటిని రెడ్‌ స్టేట్స్‌ అంటారు. ఇక 1992 నుంచి డెమోక్రాట్ల పక్షాన నిలిచిన వాటిని బ్లూ స్టేట్‌గా అభివర్ణిస్తారు. వీటిలో ఫలితాలు ఎప్పుడూ అంచనాల అనుకూలంగా ఉంటాయి, ఇక స్వింగ్‌ స్టేట్స్‌లో ఇరు పార్టీల మధ్య గెలుపోటములు దోబూచులాడుతుంటాయి. ఎవరు గెలిచినా ఇక్కడ స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతారు. 2020 ఎన్నికల్లో కీలకమైన ఆరిజోనాలో బైడెన్‌ కేవలం 10 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇదే రాష్ట్రాల్లో అక్టోబర్‌ 29న రాయిటర్స్‌–ఇప్సాస్‌ సర్వేలో డెమోక్రాట్లు ముందజలో ఉన్నట్లు తెలిపింది.