https://oktelugu.com/

Sugar: ఒక నెల రోజులు షుగర్ తినడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులివే!

ఒక్క నెల రోజుల పాటు పంచదారను తినకుండా ఉంటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయట. మరి నెల రోజుల పాటు షుగర్ తినకపోతే శరీరంలో జరిగే మార్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 / 03:02 AM IST

    Sugar

    Follow us on

    Sugar:  తినడానికి తీపిగా ఉండే పంచదారను తింటే అనారోగ్యానికి చేటు వాటిల్లుతుంది. తీపి ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసిన కూడా కొందరు తినడానికి ఇష్టపడుతుంటారు. పంచదారను ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుంది. పంచదార తినకూడదని కొందరు ఆర్టిఫిషియల్ స్విటనర్ కూడా వాడుతుంటారు. వీటిని రసాయనాలతో కలిపి తయారు చేయడం వల్ల ఇవి ఇంకా ఆరోగ్యానికి మంచివి కాదు. అయితే చాలా మంది తప్పకుండా పంచదారను రోజులో వాడుతుంటారు. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగడానికి తప్పకుండా వాడుతారు. షుగర్ ఉన్నవారు అయితే పంచదార లేకుండా టీ, కాఫీ తాగుతారు. కానీ మిగతా అందరూ కూడా తప్పకుండా షుగర్ వాడుతారు. దీనికి తోడు స్వీట్లు, పంచదారతో చేసిన పదార్థాలు ఇలా ఏవీ వదలకుండా తింటారు. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క నెల రోజుల పాటు పంచదారను తినకుండా ఉంటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయట. మరి నెల రోజుల పాటు షుగర్ తినకపోతే శరీరంలో జరిగే మార్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    పంచదారతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటం, తినకపోవడం వంటివి చేస్తే చర్మం దృఢంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తీపికి బదులు తేనె వాడితే ఇంకా మంచిది. షుగర్ తీసుకోకపోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అలాగే కంటిచూపు మెరుగుపడుతుంది. షుగర్ తినడం వల్ల ముఖం వాపు వస్తుంది. అదే నెల రోజుల పాటు షుగర్ తినకపోతే ముఖం వాపు తగ్గుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. షుగర్ వల్ల బరువు పెరుగుతారు. అదే నెల రోజుల పాటు తినడం మానేస్తే ఈజీగా బరువు తగ్గుతారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పంచదార తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే షుగర్ వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. కొందరు రోజుకి రెండు నుంచి మూడు పూటలు టీ లేదా కాఫీ తాగుతారు. దీనివల్ల వారి శరీరంలోకి పంచదార ఎక్కువగా వెళ్లి అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి షుగర్‌ను వాడటం తగ్గించండి.

     

    షుగర్ ఎక్కువగా తింటే మానసిక సమస్యలు వస్తాయి. అదే తీసుకోకుండా నెల రోజుల పాటు ఉంటే మీ మానసిక స్థితి సరిగ్గా ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్‌ అయిన డోపమైన్, ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయి. దీనివల్ల సంతోషంగా ఉంటారు. చక్కెరలోని యాసిడ్ నోటిలో బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల నోటి చివర్లలో పగుళ్లు వస్తాయి. అదే షుగర్ తీసుకోకుండా ఉంటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొందరు తీపి ఎక్కువగా తినడం వల్ల డిప్రెషన్‌కి గురవుతారు. అదే పూర్తిగా షుగర్ మానస్తే.. డిప్రెషన్ నుంచి బయటపడతారు. కాబట్టి ఒక నెల రోజుల పాటు షుగర్ తినడం మానేయండి. శరీరంలో వచ్చే మార్పులు మీరే చూస్తారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.