https://oktelugu.com/

Health Tips: ఒక్కరోజు అని నిర్లక్ష్యం చేయొద్దు… దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.. కువైట్ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?

Health Tips కువైట్ లోని డాస్ మెన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. నిద్రకు, విశ్రాంతికి, దీర్ఘకాలిక వ్యాధులకు మధ్య ఉండే సంబంధమేంటనే పరిశోధనలు చేసింది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2025 / 07:30 AM IST
    Health Tips (8)

    Health Tips (8)

    Follow us on

    Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల పనులతో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. డబ్బు సంపాదించాలని కోరికతో పాటు.. జీవితంలో కొన్ని లక్ష్యాలను చేరుకోవాలి అనే క్రమంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం లేదు. కొందరు తీవ్ర ఒత్తిడితో ఒక్కోసారి సరైన నిద్రపోవడం లేదు. అయితే కొన్ని పనుల కారణంగా నిద్రను పక్కన పెడుతున్నారు. ఇలా ఒక్కరోజు అయితే పర్వాలేదు అనుకుంటూ ప్రతిరోజు నిద్రకు దూరమవుతున్నారు. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఒక్కరోజు నిద్ర లేకున్నా కూడా శరీరంలో కొన్ని క్రియలు జరిగి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఒక్కరోజు నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?

    Also Read: బట్టతల, జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఇవి రెగ్యులర్ గా తింటూ ఉండాలి.. అవేంటంటే?

    ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలతో పాటు ఆరోగ్య సూత్రాలను కూడా పాటించాలి. రోజువారి వ్యాయామంలో నిద్ర కూడా ప్రధానమైనదే. సరైన నిద్ర పోయినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నిద్ర గడియారాన్ని ఏర్పాటు చేసుకొని సరైన సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా ఒక్కరోజైనా నిద్రకు భంగం కలిగితే శరీరంలో కార్టీ స్టాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రోజుల తరబడి రిలీజ్ కావడంతో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

    కువైట్ లోని డాస్ మెన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. నిద్రకు, విశ్రాంతికి, దీర్ఘకాలిక వ్యాధులకు మధ్య ఉండే సంబంధమేంటనే పరిశోధనలు చేసింది. వారు తెలిపిన ప్రకారం నిద్రపోని సమయంలో మెదడు భారంగా ఉంటుంది. దీంతో అనుకోకుండానే ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కోసారి ఎటువంటి పని చేయలేకపోయినా మనసు భారంగా ఉండి పోతుంది. ఇలాంటి సమయంలో కార్టి సాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ కావడంతో శరీరంలో నిద్రలేమి లక్షణాలు పెరిగిపోతాయి. ఫలితంగా నిద్రపోవాలని అనిపించిన సమయానికి నిద్ర రాదు. ఆ తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి కణాలు తగ్గిపోతాయి.

    అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి శరీరంలో మోనో కైట్స్ అనే వ్యాధి నిరోధక కణాలను విడుదల చేయాలి. ఇవి రిలీజ్ కావాలంటే సరైన నిద్ర పోవాల్సిందే. అలా కాకుండా నిద్ర పై నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘ కాలంలో ఉపకాయం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. క్రమంగా గుండె జాబులకు కూడా దారితీస్తుంది. అయితే కొందరు డబ్బు ఆశలో పడి చిన్నచిన్న ఆనందాలు కూడా కోల్పోతున్నారు. అలాకాకుండా ఏదో ఒక సందర్భంలో కుటుంబంతో పాటు వ్యక్తిగతంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్లే సరైన నిద్ర పోయేందుకు మార్గం ఏర్పడుతుంది. అలా కాకుండా నిద్రకు బంధం కలిగితే భవిష్యత్తులో అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

    ఒకవేళ నిద్రపోని పక్షంలో విశ్రాంతి తీసుకునే ప్రయత్నం అయినా చేయాలి.ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి అవుతుంది. ముఖ్యంగా మానసికంగా ఆందోళనకు దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. ఆ తర్వాత ఎక్కువ పని చేయడానికి ఎనర్జీ కూడా వస్తుంది.

     

    Also Read:  ఈ కార్లపై రూ.1.70 లక్షల తగ్గింపు.. మార్చి 31 లోపే.. వెంటనే తెలుసుకోండి..