https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశుల వారికి శుభవార్త.. ఆ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు..

Today Horoscope In Telugu ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఆదాయం లభిస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండదు.

Written By: , Updated On : March 17, 2025 / 07:34 AM IST
Today Horoscope In Telugu (4)

Today Horoscope In Telugu (4)

Follow us on

Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు ధ్రువయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల వాతావరణ ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు ఆర్థికంగా నష్టపోతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఆదాయం లభిస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండదు. ఇతరులతో ఏదైనా వివాదం జరిగితే వెంటనే పరిష్కరించుకోవాలి. ప్రియమైన వారి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. మానసికంగా ఆందోళన ఉంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.

Also Read: పుట్టిన ప్రతి బిడ్డ తలనీలాలు ఎందుకు సమర్పించాలి?

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొన్ని సంవత్సరాలు ఎదుర్కొంటారు. వీటిని పరిష్కరించుకోవడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. గతంలో ఉన్న ఆందోళన నీటితో తగ్గిపోతుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు నుంచి బాగుంటుంది. కష్టపడిన దానికి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే ఈ విషయంలో వెంటనే అప్రమత్తం కావాలి. మానసికంగా కాస్త ఆందోళనగా ఉంటారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసులో ఏదైనా ఆందోళనగా ఉంటే స్నేహితుల ద్వారా పరిష్కారం అవుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. వీటివల్ల ధన లాభం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. వ్యాపారులకు లాభాలు రావడానికి ఇతరుల సలహా తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తిరిగి పొందుతారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వైద్యుల ను సంప్రదించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో పెండింగ్ సమస్యలను పూర్తి చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఆర్థికంగా మెరుగైన ఫలితం సాధిస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారికి డబ్బు అవసరం పడితే వివిధ మార్గాల నుంచి అందుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకుంటారు. పాదయాత్రలకు ప్లాన్ చేస్తారు. సోదరుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరి దగ్గర అప్పు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. పెద్దల సలహాతో వ్యాపారులు కాస్త లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి శుభవార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు సహాయం చేస్తే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. ఇతరులకు ధన సహాయం చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. చట్టపరమైన చిక్కుల్లో ఎదుర్కొంటే వాటి పరిష్కారానికి మార్గం వెతకాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది.. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే సమస్య మరింతగా ఎక్కువగా మారే అవకాశం.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. పూర్వీకులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం పై ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మాటలు మాధుర్యం కొందరు దగ్గరి బంధువులు అవుతారు. ఉద్యోగులు తమ పనులల్లో నిర్లక్ష్య ఉండొద్దు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . వ్యాపారలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రణాళికలు చేపడతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది
పిల్లల ఉద్యోగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సాయంత్రం శుభవార్తలు వింటారు.