Sleep Health (1)
Sleep Health: మనుషుల ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే కొందరు సరైన నిద్రపోవాలనే ఉద్దేశంతో అతిగా నిద్రపోవడం చేస్తున్నారు. అయితే మోతాదుకు మించితే ఆహారం ఎంత విషమవుతుందో.. నిద్ర కూడా ఎక్కువ పోతే అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు. నిద్ర తక్కువ కావడంతో ఎన్ని అనర్ధాలు ఉన్నాయో.. ఎక్కువ అయితే కూడా అంతే ప్రమాదం అని అంటున్నారు.. అయితే అతిగా నిద్రపోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: ఈ కార్లపై రూ.1.70 లక్షల తగ్గింపు.. మార్చి 31 లోపే.. వెంటనే తెలుసుకోండి..
కొందరు ఆరోగ్యంగా ఉండాలని నిద్ర గడియారని పాటిస్తూ ఉంటారు. మరికొందరు సమయం దొరికినప్పుడల్లా కునుకు తీస్తూ ఉంటారు. ఇంకొందరు ఏ పని చేయకుండా నిద్రపోతూనే ఉంటారు. ఇలా ఏరకంగా నైనా ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అతిగా నిద్రపోవడం వల్ల షుగర్ స్థాయి నిలువలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో తక్కువ వయసులోనే షుగర్ వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అలాగే అధిక నిద్రా పోవడం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారని అంటున్నారు. దీంతో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకపోయి రెండో జబ్బులకు కూడా దారితీస్తుందని తెలుపుతున్నారు.
కొందరు తిన్న వెంటనే నిద్రపోతూ ఉంటారు. మరికొందరు ఇంట్లోనే కాకుండా కార్యాలయాల్లో, ఇతర ప్రదేశాల్లో సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూస్తూ ఉంటారు. అయితే ఇలా నిద్ర గడియారాన్ని పాటించకుండా ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు.. నిద్రపోవడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అతిగా నిద్రపోయే వారిలో అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహం లేకుండా ఉంటారు. ఏ పనిని పూర్తి చేయకుండా ఉంటారు. అందువల్ల అతిగా నిద్రపోయేవారు ఇప్పటికైనా షెడ్యూల్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది
ప్రతిరోజు ఒక వ్యక్తి ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర పోవడం మంచిది. ఇది సాయంత్రం 8 లేదా 9 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు మాత్రమే నిద్రపోయే ప్రయత్నం చేయాలి. రాత్రుల్లో విధులు చేసేవారు, ఇతర కారణాలతో మెలకువ ఉన్నవారు తప్ప.. కాలక్షేపం కోసం.. సరదా కోసం నిద్రను పాడు చేసుకోవడం మంచిది కాదని అంటున్నారు. అలాగని రాత్రులు ఎక్కువసేపు మెలకువతో ఉండి ఉదయం 9 నుంచి 10 గంటలకు నిద్ర లేవడం కూడా ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. పిల్లలను ఉదయం కచ్చితంగా 6 గంటల లోపు నిద్ర లేపే ప్రయత్నం చేయాలి. అలాగే సాయంత్రం 8 గంటలకు నిద్ర పోయేటట్లు చేయాలి. మీరు కూడా మధ్యాహ్నం నిద్రపోతున్నట్లు గమనిస్తే వెంటనే వారికి సరైన విధంగా సూచనలు చేయాలి.
Also Read: బట్టతల, జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఇవి రెగ్యులర్ గా తింటూ ఉండాలి.. అవేంటంటే?