Homeహెల్త్‌Tuniki Fruits: ప్రకృతి ప్రసాదించిన ఫలం ఇదీ.. ఈ సీజన్ లోనే దొరుకుతుంది.. ఎట్టి పరిస్థితుల్లో...

Tuniki Fruits: ప్రకృతి ప్రసాదించిన ఫలం ఇదీ.. ఈ సీజన్ లోనే దొరుకుతుంది.. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి!

Tuniki Fruits:  ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ అక్కడక్కడ అడువులు కనిపిస్తున్నాయి. అందులో తునికి చెట్లు దర్శనమిస్తున్నాయి. తునికి చెట్లు నిటారుగా పెరుగుతాయి. వీటి కాండం మందంగా ఉంటుంది. ఆకులు కూడా దళసరిగా ఉంటాయి. ఇవి నవంబర్ నుంచి జనవరి నెల వరకు పుష్పిస్తాయి. ఆ ఆ పువ్వులు ఆ తర్వాత పిందెలుగా మారుతాయి.. క్రమక్రమంగా కాయలుగా రూపాంతరం చెందుతాయి. పక్వ స్థితికి చేరిన తర్వాత రాలి కింద పడతాయి. తునికి పండ్లు చూసేందుకు ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇందులో ఉన్న గుజ్జు తీపి, పులుపు రుచుల సమ్మేళనంగా ఉంటుంది. ప్రతి పండులో రెండు గింజలు ఉంటాయి. పండు పై ఉన్న తొక్క, మందంగా ఉంటుంది. తినడానికి అది కూడా రుచికరంగా ఉంటుంది. మధుమేహం ఉన్న రోగులు ఆ పండును తింటే ఎంతో బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.

Also Read: మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..

విక్రయిస్తున్నారు

తునికి పండ్లు అరుదుగా లభిస్తుంటాయి. ఈ చెట్లు కేవలం అడవుల్లో మాత్రమే ఉంటాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఈ చెట్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అయితే మగ తునికి చెట్లు కాయలు కాయవు. కేవలం ఆడ తునికి చెట్లు మాత్రమే కాయలు కాస్తాయి. వీటిని తెలంగాణ సపోటా అని పిలుస్తుంటారు. ఈ పండ్లు కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తాయి. వీటిల్లో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడే వారికి ఈ పండ్లు తింటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రక్తపోటును ఈ పండ్లు అదుపులో ఉంచుతాయి. మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి. ఇక ఈ పండులో ఉండే ప్రత్యేకమైన కెరోటినాయిడ్లు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా తింటారు కాబట్టి ఆదివాసీలు బలంగా ఉంటారు. ప్రస్తుతం ఈ పండ్లను సేకరించి ఆదివాసీలు అమ్ముతున్నారు. కిలో పండ్లను 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. అరుదుగా ఈ పండ్లు లభిస్తుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తునికి పండ్లను తిన్న తర్వాత.. వాటి తొక్కను ఎండబెట్టి.. ఎండిన తొక్కలను దంచి.. ముఖానికి ప్యాక్ లాగా పూసుకుంటే చర్మంలో మలినాలు తొలగిపోయి.. మరింత కాంతివంతంగా కనిపిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.

గమనిక: వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కథనం రాశాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు వైద్యుల సలహాల మేరకు ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.

 

Also Read: పాక్ పరువు సింధు నది పాలు.. ఈసారి ఏం జరిగిందంటే..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version