Roshan : తిరుగులేని తెలుగు లేడీ యాంకర్ సుమ కనకాలకు భారీ ఫేమ్ ఉంది. దశాబ్దాలుగా ఆమె బుల్లితెరను ఏలుతుంది. సినిమా వేడుకల్లో సందడి చేస్తుంది. నటుడు రాజీవ్ కనకాల సతీమణి సుమకు అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయి రోషన్ కనకాల ను హీరోగా పరిచయం చేసింది. బబుల్ గమ్ టైటిల్ తో క్రేజీ న్యూస్ ఏజ్ లవ్ డ్రామా చేశాడు. బబుల్ గమ్ మూవీ పర్లేదు అనిపించుకుంది. రోషన్ నటనకు మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా మూవీ ఆడలేదు. రెండో ప్రయత్నంగా మోగ్లీ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు.
Also Read : హాలీవుడ్ యాక్షన్ హీరో ని తలపిస్తున్న శ్రీకాంత్ కొడుకు రోషన్..అదిరిపోయిన ‘ఛాంపియన్’ టీజర్!
కలర్ ఫోటో చిత్రంతో పరిశ్రమను ఆకర్షించిన దర్శకుడు సందీప్ రాజ్ మోగ్లీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. రోషన్ కనకాల జన్మదినం నేపథ్యంలో మోగ్లీ నుండి రోషన్ లుక్ విడుదల చేశారు. రోషన్ వింటేజ్ లుక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో భటులు ఉన్నారు. ఇది రాజుల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందా? అనే సందేహం కలుగుతుంది. మోగ్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక సుమ కనకాల ఫ్యాన్స్ రోషన్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఆయన మోగ్లీ మూవీతో విజయం అందుకోవాలని కోరుకుంటున్నారు. మోగ్లీ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం. మరోవైపు సుమ పెద్దగా బుల్లితెర షోలు చేయడం లేదు. సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తుంది. గతంలో మాదిరి ఆమె బుల్లితెర షోలపై ఆసక్తి చూపడం లేదు. సినిమా ఈవెంట్స్ లో మాత్రం సందడి చేస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో సుమ భారీగా ఆర్జించింది. తన కంటే ఎక్కువ సంపాదిస్తుంది అని రాజీవ్ ఓ సందర్భంలో ఒప్పుకున్నాడు.
సుమ కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల జయమ్మ పంచాయితీ పేరుతో విలేజ్ డ్రామా చేసింది. ఈ మూవీలో తానే లీడ్ రోల్ చేసింది. జయమ్మ పంచాయితీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మరలా లీడ్ రోల్స్ చేయాలన్న ఆలోచన వదిలేసింది. రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నాడు.
Also Read : రోషన్ ను పట్టుకొని ఏడ్చేసిన హీరో నాని.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!
#Mowgli2025 : Birthday Poster.
Team Mowgli wishes their Lead Actor #RoshanKanakala! Now in Regular shoot. pic.twitter.com/xARPD3zDIt
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 15, 2025