Pakistan (4)
David Miller Watch: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించి పాకిస్తాన్ తన పరువు తీసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు పరువు పోయే సంఘటన మరొకటి జరిగింది. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టును, పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తూర్పారబడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి పనిచేయడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు.. అసలు ఇలాంటి జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు..” ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. అసలు ఇలాంటి పనులు చేసి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని” పాకిస్తాన్ ఆటగాళ్లపై నెటిజన్లు మండిపడుతున్నారు..
Also Read: మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..
ఇంతకీ ఏం జరిగిందంటే
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ లోని లాహోర్ స్టేడియం వెళ్ళింది. తన ప్రత్యర్థి తో తలపడింది. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కు చెందిన 1.4 కోట్ల రూపాయల విలువైన చేతి వాచ్ చోరీకి గురైంది. అతడు పాకిస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు సిసి కెమెరాల దృశ్యాల ఆధారంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దానికంటే ముందు ముగ్గురు పాకిస్తాన్ బ్యాటర్లు, ఇద్దరు బౌలర్లు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చినట్టు సీసీటీవీలో దృశ్యాల ఆధారంగా పాకిస్తాన్ పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు డేవిడ్ మిల్లర్ వాచ్ ను పాకిస్తాన్ పోలీసులు రికవరీ చేయలేకపోయారు. ఇప్పటికీ ఈ కేసు సంబంధించి దర్యాప్తును కొనసాగిస్తున్నామని వారు చెబుతున్నారు. ” పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు లాహోర్ స్టేడియంలో మ్యాచ్ ఆడింది.
ఆ సమయంలో డేవిడ్ మిల్లర్ తను ధరించే వాచ్ ను డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టాడు. దాని విలువ1.4 కోట్ల వరకు ఉంటుంది. అంత విలువైన వాచ్ ఇప్పుడు కనిపించడం లేదు. దానిపై డేవిడ్ మిల్లర్ పాకిస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాకిస్తాన్ పోలీసులు సీసీ కెమెరాలలో ఉన్న దృశ్యాల ఆధారంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా లో దృశ్యాలను చూస్తుండగా కొంతమంది పాకిస్తాన్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లినట్టు కనిపించిందని” దక్షిణాఫ్రికా మీడియా తను ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను వెనకేసుకొస్తోంది. తోటి జట్టు ఆటగాళ్లు ఉన్న డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తే తప్పులు వెతకాల్సిన అవసరం ఏముందని.. 1.4 కోట్ల వాచ్ ను తస్కరించాల్సిన అవసరం తమ ఆటగాళ్లకు లేదని వివరించింది. ఐతే మిల్లర్ వాచ్ చోరీకి గురైన నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై అసహనం వ్యక్తం చేసింది. ట్రై సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్లో ఆడేందుకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అక్కడే ఆడింది. సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.