Homeజాతీయ వార్తలుTrump : ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లెవరూ అమెరికాలో అడుగు...

Trump : ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లెవరూ అమెరికాలో అడుగు పెట్టలేరు

Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం త్వరలో 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించాలని పరిశీలిస్తోంది. పదుల కొద్ది దేశాల పౌరుల పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు ఇంటర్నల్ మెమో డజన్ల కొద్దీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తన నివేదికలో తెలిపింది.

ఇందుకు సంబంధించి ఇంటర్నల్‌ మెమో ఒకటి బయటికొచ్చింది. ఈ మెమోరాండంలో 41 దేశాల లిస్ట్ ఉంటుంది.ఈ దేశాలన్నింటినీ మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాలో పాకిస్తాన్ పేరు కూడా ఉంది. ఇందువల్ల పాక్ పౌరులు ఇక మీదట అమెరికాలో అడుగు పెట్టలేరు. ఫస్ట్ గ్రూపులో 10 దేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా. ఈ దేశాల పౌరులకు వీసాలు పూర్తిగా బ్యాన్ చేయనున్నారు.

Also Read : ట్రంప్‌ రివర్స్‌ గేర్‌.. కెనడాపై డబుల్‌ సుంకాల విషయంలో వెనక్కు తగ్గిన అగ్రరాజ్యాధినేత!

రెండో గ్రూపులో ఐదు దేశాలు ఉన్నాయి: ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్. ఈ దేశాలు పాక్షిక నిషేధాన్ని ఎదుర్కోనున్నాయి. ఇది టూరిజం, స్టూడెంట్ వీసాలతో పాటు ఇతర వలస వీసాలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండవచ్చు.

మూడో గ్రూపులో బెలారస్, పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వంటి దేశాలు సహా 26 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంపై పాక్షిక నిషేధం ఉండనుంది. అయితే, ఈ దేశాలకు 60 రోజుల్లోపు భద్రతా లోపాలను తొలగించే అవకాశం ఇవ్వనున్నాయి.

ఈ జాబితాలో మార్పులు సాధ్యమేనని ఓ అమెరికన్ అధికారి తెలిపారు. అంటే ఇంకా కొన్ని కొత్త దేశాలను యాడ్ చేయవచ్చు.. లేకపోతే కొన్ని దేశాలను తొలగించవచ్చు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాతే తుది జాబితా రిలీజ్ అవుతుంది.

ట్రంప్ పరిపాలన వీసా ఆంక్షలు విధిస్తే అదేమీ కొత్త విధానం కాదు. తన మొదటి టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించారు. దీనిని 2018లో సుప్రీంకోర్టు సమర్థించింది. అధ్యక్షుడైన వెంటనే డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే విదేశీ పౌరుల భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని పిలుపునిచ్చింది.

ఈ ఉత్తర్వు ప్రకారం మార్చి 21 నాటికి అనేక మంది క్యాబినెట్ సభ్యులను దేశాల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. ఆ దేశాల పౌరులట్రావెల్ ను పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధించాలని చూస్తున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు కనుగొన్న దేశాలను చేర్చడానికి ఇది ఉద్దేశించింది. ఇది కాకుండా అక్టోబర్ 2023లో ఇచ్చిన ప్రసంగంలో అమెరికా భద్రత దృష్ట్యా గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇతర సున్నితమైన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలను నిషేధిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.

Also Read : ట్రంప్‌ను వ్యతిరేకిస్తే యోధుడే.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నేతలకు పెరుగుతున్న ఆదరణ..!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version