శనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మన శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిలో శనగలు ముందువరసలో ఉంటాయి. కొంతమంది శనగలను ఉడికించుకుని తినడానికి ఇష్టపడితే మరి కొంతమంది వేయించుకుని తినడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ ఒక కప్పు శనగలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసమైన పోషకాలు లభిస్తాయి. శనగల్లో మాంసంలో ఉండే ప్రోటీన్స్ ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేయడంలో శనగలు సహాయపడతాయి. Also Read: వేగంగా ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా.? శాఖాహారులలో చాలామంది ప్రోటీన్ […]

Written By: Navya, Updated On : January 25, 2021 10:56 am
Follow us on

మన శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిలో శనగలు ముందువరసలో ఉంటాయి. కొంతమంది శనగలను ఉడికించుకుని తినడానికి ఇష్టపడితే మరి కొంతమంది వేయించుకుని తినడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ ఒక కప్పు శనగలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసమైన పోషకాలు లభిస్తాయి. శనగల్లో మాంసంలో ఉండే ప్రోటీన్స్ ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేయడంలో శనగలు సహాయపడతాయి.

Also Read: వేగంగా ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా.?

శాఖాహారులలో చాలామంది ప్రోటీన్ లోపం సమస్యతో బాధ పడుతూ ఉంటారు. శనగలు తీసుకోవడం వల్ల ఆ సమస్యను సులభంగా అధిగమించడం సాధ్యమవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో కూడా శనగలు సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే శనగలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు హానికరమైన విష పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి.

Also Read: మితంగా భోజనం చేసి బరువు తగ్గాలనుకుంటున్నారా.. చిట్కాలివే..?

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండే శనగలు రక్తం గడ్డకట్టకుండా చేయడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంచడంతో సహాయపడతాయి. శనగలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. శనగలు తినడం వల్ల కడుపు నిండుగా ఉండటంతో పాటు సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

శనగల్లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడుతుంది. శనగల ద్వారా శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ లాంటి పోషకాలు లభిస్తాయి. పచ్చ కామెర్లతో బాధ పడేవాళ్లు శనగలు తింటే త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి.