ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు కొత్త అప్ డేట్స్ !

నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు మొదటినుండీ కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. మరోపక్క ఈ సినిమా ప్రకటన చేసి చాలా రోజులవుతున్న క్రమంలో.. మళ్ళీ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అందుకే ‘ఏదైనా అప్ డేట్ ఇవ్వండి నాగ అశ్విన్’ అంటూ ప్రభాస్‌ అభిమానులు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగ అశ్విన్‌ బదులిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన […]

Written By: Neelambaram, Updated On : January 25, 2021 10:41 am
Follow us on


నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు మొదటినుండీ కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. మరోపక్క ఈ సినిమా ప్రకటన చేసి చాలా రోజులవుతున్న క్రమంలో.. మళ్ళీ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అందుకే ‘ఏదైనా అప్ డేట్ ఇవ్వండి నాగ అశ్విన్’ అంటూ ప్రభాస్‌ అభిమానులు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగ అశ్విన్‌ బదులిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన రెండు కొత్త అప్‌డేట్లు ఇవ్వబోతున్నట్లు అశ్విన్‌ స్పందిస్తూ.. ‘కచ్చితంగా ఈ జనవరి 29న ఒకటి.. ఫిబ్రవరి 26న మరొకటి.. అప్‌డేట్స్‌ అందించనున్నాం’ అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.

Also Read: వైరల్ అవుతోన్న ‘గ్యాంగ్’తో గ్యాంగ్ లీడ‌ర్ !

మొత్తానికి నాగ్ అశ్విన్ కు ఫ్యాన్స్ నుండి వస్తోన్న ప్రశ్నల వర్షం దెబ్బకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగుతుందని.. ఆ దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడని.. జనవరి నాటికి ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అవుతాయని తెలుస్తోంది. అయితే మొదట ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: ‘మహా సముద్రం’లో బోల్డ్ బ్యూటీ !

కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేదు. భారీ సీన్స్ తీసే క్రమంలో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కావాలి. దానికి తగ్గట్లు అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక నాగ్ అశ్విన్ ఓ పురాణ కథ ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాడని, కథలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. అన్ని భాషల వారికి నచ్చే అంశాల ఆధారంగా ఈ సినిమాని తీయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని మేకర్స్.. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంటుంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్