జగనన్న బాణం.. యూటర్న్..?

వైఎస్ జగన్ మెహన్ రెడ్డి ఏ ముహూర్తంలో అధికారంలోకి వచ్చారో.. ఏమో కానీ.. ఆ కుర్చీ ఎక్కిన రోజు నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో సతమతం అవుతున్నారు. ఓ వైపు ప్రజలకు పథకాల వరాలు కురిపిస్తూనే.. మరో వైపు తన చుట్టూ అల్లుకుంటున్న పద్మవ్యూహంపై మదన పడుతున్నాడు. వరుసగా జరుగుతున్న ఘటనలతో జగన్ కలత చెందుతున్నాడు. ఇప్పటికే.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి ప్రభుత్వానికి విబేధాలు భగ్గుంటున్నాయి. Also Read: ఇవాళ్లి నుంచే ఏపీలో […]

Written By: Srinivas, Updated On : January 25, 2021 12:48 pm
Follow us on


వైఎస్ జగన్ మెహన్ రెడ్డి ఏ ముహూర్తంలో అధికారంలోకి వచ్చారో.. ఏమో కానీ.. ఆ కుర్చీ ఎక్కిన రోజు నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో సతమతం అవుతున్నారు. ఓ వైపు ప్రజలకు పథకాల వరాలు కురిపిస్తూనే.. మరో వైపు తన చుట్టూ అల్లుకుంటున్న పద్మవ్యూహంపై మదన పడుతున్నాడు. వరుసగా జరుగుతున్న ఘటనలతో జగన్ కలత చెందుతున్నాడు. ఇప్పటికే.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి ప్రభుత్వానికి విబేధాలు భగ్గుంటున్నాయి.

Also Read: ఇవాళ్లి నుంచే ఏపీలో నామినేషన్లు.. కనిపించని ఎన్నికల హడావిడి..కోర్టు తీర్పే కీలకం?

ఈ క్రమంలో ఆంధ్రజోతిలో ఆదివారం ప్రచురితమైన కొత్త పలుకు అంశం ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అన్న జగన్ మెహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల నూతన పార్టీ పెట్టబోతుందన్న ప్రచారం హల్ చల్ చేస్తోంది. అయితే దీన్ని చాలా మంది నమ్మడం లేదు. అయితే ప్రధానం జగన్ ఆయన సోదరి గొడవ పడ్డారని.. కుటుంబంతో విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారనే అంశం కీలకంగా మారింది. అయితే ఈ ప్రచారం విషయంలో వైఎస్ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అసలు దీన్నీ వాళ్లు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. చిన్న చిన్న విషయాలకే బూతులతో విరుచుకుపడే.. వైసీపీ సోషల్ మీడియా సైతం దీనిపై స్పందించడం లేదు.

Also Read: తిట్టిన నోటితోనే జగన్ ను పొగిడేసిన పవన్

దీంతో వైఎస్ కుటుంబంలో నిజంగానే గొడవలు ప్రారంభం అయ్యాయా…అనే చర్చలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతలు సైతం ఆ విషయంలో మౌనంగా ఉన్నారు. ఏం మాట్లాడితే.. ఏం రాస్తారో అన్న సందేశంతో నోరు మూసుకుని కూర్చున్నారు. నిజానికి వైసీపీలో ఏం మాట్లాడాలన్న దానిపై ఎవరికీ స్వేచ్ఛ లేదు. హై కమాండ్ నుంచి ప్రెస్ నోట్ వస్తే.. తప్పా.. దానికి అనుకూలంగా ఎవరూ మాట్లాడరు.

ఇక షర్మిల అంశంపై ఎలా స్పందించాలన్న విషయంలో నో కామెంట్ అన్నదానికే పరిమితం అవుతున్నారు వైసీపీ నాయకులు. నిజానికి షర్మిలా లేదా.. ఆమె సన్నిహితులు స్పందిస్తేనే ఆ కథనాలకు ఖండన వచ్చినట్లవుతుంది. అలా కాకుండా వైసీపీ నేతలు స్పందిస్తే.. ఆ వివాదం మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉంది. అయితే షర్మిల కానీ.. తన సన్నిహితులు కానీ స్పందించకుంటే.. తాము ముందు స్పందిస్తే.. విషయం పెద్దది అవుతుందని.. ఈ క్రమంలో తాము సైలెంట్ ఉండడమే ఉత్తమం అని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

షర్మిల రాజకీయ పార్టీ అంశంపై సైతం అంతర్గతంగా కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ అది అంత సీరియస్ గా ఉంటుందని అనుకోలేదు. జగన్ కుటుంబంలో గొడవలు ఉన్నాయో లేవో.. షర్మిల పార్టీ పెడుతుందో లేదో.. వచ్చే నెల 9వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆరోజే షర్మిలా పార్టీ పెడతారని ఏబీఎన్ ఆర్కే కూడా చెప్పారు మరీ..