https://oktelugu.com/

Hair getting white:మీ జుట్టు తెల్లబడుతోందా.. అయితే ఈ పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే!

ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారికి జుట్టు తొందరగా తెల్లగా అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ప్యాకేజీడ్ ఫుడ్ తీసుకున్న వారిలో కూడా తెల్లజుట్టు ఎక్కువగా కనిపిస్తుంది

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 5, 2024 / 05:01 AM IST

    Gray-hair

    Follow us on

    Hair getting white:సాధారణంగా వయస్సు పెరిగితే జుట్టు తెల్లబడుతుంది. కానీ ఈ రోజుల్లో వయస్సులో ఉన్నవారికి కూడా జుట్టు తెల్లబడుతోంది. చివరికి చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తుంది. మన జీవనశైలిలో మార్పులు, వాయు కాలుష్యం, వంశపారంపర్యం వంటి కారణాల వల్ల తెల్ల జట్టు అనేది వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం రోజూ తినే ఆహార పదార్థాలు, మన అలవాట్ల వల్ల జుట్టు అనేది తెల్లగా మారుతుంది. ప్రస్తుతం చాలామంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్, మద్యం, ధూమపానం వంటి వాటిని ఎక్కువగా తాగుతున్నారు. వీటివల్ల కూడా జుట్టు తెల్లబడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మరి ఈ తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే డైలీ లైఫ్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలి. అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారికి జుట్టు తొందరగా తెల్లగా అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ప్యాకేజీడ్ ఫుడ్ తీసుకున్న వారిలో కూడా తెల్లజుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్యాకేజ్ చేసిన ఫుడ్‌లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఇందులో ఉప్పును అధికంగా వాడుతారు. దీనివల్ల జుట్టు రాలిపోవడం, తెల్లగా అయిపోవడం, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే కొందరు మోతాదుకి మించి కాఫీ, టీ తాగుతుంటారు. ఇందులో కెఫిన్ తొందరగా జుట్టు తెల్లబడేలా చేస్తుంది. అలాగే పోషకాలు లేని వేయించిన పదార్థాలను కూడా తీసుకోకూడదు. జుట్టుకి సరైన పోషణ అందక.. జుట్టు తెల్లబడుతుంది. అలాగే కొందరికి జన్యుపరమైన లోపాలు, పోషకాహార లోపం ఉంటుంది. శరీరంలో విటమిన్లు, బయోటిన్ వంటి పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు తెల్లబడుతుంది.

    ఒత్తిడి, ఆందోళన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ విషయం తెలిసిన కూడా ప్రతి విషయానికి టెన్షన్‌ అయ్యి ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి వల్ల తొందరగా జుట్టు తెల్లగా మారుతుంది. వీటితో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్, శీతల పానీయాలు, చక్కెర వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అలాగే తెల్ల జుట్టు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉసిరి రసం తాగడం, పెరుగు తినడం, కరివేపాకు తినడం వంటివన్నీ చేయాలి. జుట్టుకు ఆముదం, వేప నూనె వంటివి రాయాలి. వారానికి ఒకసారి జామ ఆకుల పేస్ట్‌ను తలకు పెట్టడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. వీటితో పాటు తలకు కొబ్బరి నూనె రాస్తే జట్టు తొందరగా నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు, మెంతులు కలిపి రాస్తే జుట్టు బలంగా, దృఢంగా పెరగడంతో పాటు తెల్లబడకుండా ఉంటుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.