https://oktelugu.com/

Chanakya Neeti: ఈ సూత్రాలను పాటిస్తే కష్టాలు మీ దరి చేరవు..

ఒక వ్యక్తి తాను అనుకున్న పనిని పూర్తి చేయలేనప్పుడే కష్టం వస్తుంది. అంటే ఇక్కడ సరైన ప్లానింగ్ లేకపోవడమే అని చాణక్య నీతి చెబుతుంది. ఈ నేపథ్యంలో కష్టాలు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని సూత్రాలను ఫాలో కావాల్సి ఉంటుంది. వీటిని పాటిస్తే కష్టాలు రాకుండా తప్పించుకోవచ్చని చాణక్య నీతి చెబతుంది.మరి ఆ సూత్రాలు ఏవో చూద్దాం..

Written By:
  • Bhaskar
  • , Updated On : October 5, 2024 / 04:32 AM IST

    Chanakya Neeti

    Follow us on

    Chanakya Neeti: చాణక్య నీతి ప్రకారం కొన్ని సూత్రాలు మానవ జీవితానికి ఎంతో ఉపయోగపడుతాయి. మౌర్యుల కాలంలో అపర చాణక్యుడు రాజనీతి బోధనలు మాత్రమే కాకుండా హ్యుమన్ లైఫ్ స్టైల్ గురించి ఎన్నో విషయాలను చెప్పారు. అప్పుడు కొందరు గుర్తించి వాటిని ఒకరి తరువాత ఒకరు ఫాలో అవుతూ వస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో సఖ సంతోషాలు మాత్రమే కాకుండా కష్టనష్టాలు కూడా ఉంటాయి. చాలా మంది తమకు ఎన్నో కష్టాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. వాటి నుంచి బయట పడడానికి ఇతరుల సాయం కోరుతారు. మరికొందరు దేవళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి తాను అనుకున్న పనిని పూర్తి చేయలేనప్పుడే కష్టం వస్తుంది. అంటే ఇక్కడ సరైన ప్లానింగ్ లేకపోవడమే అని చాణక్య నీతి చెబుతుంది. ఈ నేపథ్యంలో కష్టాలు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని సూత్రాలను ఫాలో కావాల్సి ఉంటుంది. వీటిని పాటిస్తే కష్టాలు రాకుండా తప్పించుకోవచ్చని చాణక్య నీతి చెబతుంది.మరి ఆ సూత్రాలు ఏవో చూద్దాం..

    కలిసిమెలిసి జీవించడం:
    కొందరు ఒంటరిగా జీవించాలని చూస్తారు. తమకు ఇతరులతో సంబంధం లేకుండా వారికి కావాల్సిన పనులు చేస్తారు. కానీ ఒంటరితనం స్వేచ్ఛను ఇస్తుంంది. కానీ నిత్యం నిరాశను కలిగిస్తుంది. ఎందుకంటే ఇతరులతో కలిసి మెలిసి ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంసభ్యులతో ఉండడం వల్ల జీవితంలో కొన్ని కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. ఎవరికైనా కొన్ని సమయాల్లో ఆపదలు రావొచ్చు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు. అందువల్ల వారిని ప్రేమగా చూస్తూ… వారి బాగోగులు చూడడం వల్ల భవిష్యత్ లో ఎలాంటి కష్టాలు రాకుండా వారు సాయం చేస్తుంటారు.

    సరైన ప్లానింగ్:
    ఒక పనిని పూర్తి చేయాలంటే ప్లానింగ్ కావాలి. అలాగే జీవితానికి కూడా ప్లానింగ్ ను రూపొందించుకోవాలి. ప్రస్తుతం ఏం జరుగుతుందనే కాకుండా భవిష్యత్ లో ఎలాంటి కష్టాలు వస్తాయి? వాటి నుంచి ఎలా బయటపడాలి? వాటి కోసం ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి? అనే విషయాలపై అవగాహన ఉండాలి. అత్యవసర పరిస్తితి ఏర్పడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనే దానిపై ముందే ప్లానింగ్ చేసుకోవడం వల్ల కష్టాలు వచ్చినా పెద్దగా రిస్క్ అనిపించదు.

    కొత్త వ్యక్తులతో జాగ్రత్త:
    కొందరి జీవితంలో కొత్త వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే స్నేహం చేయడం మంచిది. లేకుంటే వారితో ఎటువంటి ఇబ్బందులైనా ఉండొచ్చు. భవిష్యత్ లో ఆ వ్యక్తి గురించి ఇబ్బందులు ఏర్పడితే ఏం చేయాలి? అనే విషయంలో ముందు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండడం వల్ల ఆ వ్యక్తి వల్ల బాధపడకుండా ఉండొచ్చు.

    ఆదాయ వనరులు సమకూర్చుకోవడం:
    నేటి కాలంలో డబ్బు చాలా ముఖ్యం. డబ్బు లేకుండా ఏ పని చేయలేము. అందువల్ల భవిష్యత్ అవసరాల కోసం డబ్బును ఆదాయం చేయడం నేర్చుకోవాలి. విద్య, వైద్యం కోసం ఆదాయ వనరులను ముందే సమకూర్చుకోవడం వల్ల భవిష్యత్ లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటారు.