spot_img
Homeహెల్త్‌Hair Fall: జుట్టు బాగా రాలుతోందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

Hair Fall: జుట్టు బాగా రాలుతోందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

Hair Fall: అమ్మాయిలకు అందం కురులు. ఇవి ఎంత దృఢంగా, అందంగా ఉంటాయో.. అమ్మాయిలు అంత అందంగా ఉంటారు. అయితే మారిన జీవనశైలి కారణంగా ఈరోజుల్లో చాలామంది జుట్టు రాలిపోతుంది. దీనికోసం ఎన్నో చిట్కాలు పాటిస్తారు. కానీ జుట్టు మాత్రం బాగా దెబ్బతింటుంది. జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే జుట్టు రాలిపోతుంది. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కేవలం జుట్టు విషయంలో మాత్రమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే జుట్టు రాలిపోవడం తగ్గి బలంగా తయారు అవుతుంది. మరి జుట్టు బలంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటో చూద్దాం.

ప్రస్తుతం యువత ఎక్కువగా రసాయనాలు ఉండే నూనెలు, షాంపూలు వాడుతున్నారు. వీటివల్ల ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటికి బదులు సికాయ్, కుంకుడు కాయలు వంటివి వాడితే జుట్టు బలంగా పెరుగుతుంది. ఈరోజుల్లో చాలామంది ఫ్యాషన్‌కి అలవాటు అయ్యి.. జుట్టుకు ఆయిల్ రాయడం లేదు. దీనివల్ల కురులు పగుళ్లు రావడంతో పాటు జుట్టు పలుచగా అయిపోతుంది. కాబట్టి వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు జుట్టుకు కుదుళ్ల నుంచి ఆయిల్ రాసి మర్దన చేయాలి. వీలైతే ఇలా రోజూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, పాలకూర, పాలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు గుడ్లు, చీజ్, ఓట్స్, సోయా, తృణధాన్యాలు, చేపలు వంటివి తీసుకోవాలి. జుట్టు పెరుగుదలకు తోడ్పడే కెరాటిన్‌ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అప్పుడే జుట్టు బలంగా పెరుగుతుంది.

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఉండకూడదు. ఒత్తిడి, మానసికంగా ఇబ్బంది పడుతుంటే జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్ని తగ్గించడానికి డైలీ యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే ఒత్తిడి తగ్గి.. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. వీటితో పాటు జుట్టు ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. ఇంట్లో దొరికే వస్తువులతో హెయిర్ ప్యాక్‌లు వేసుకోవాలి. ముఖ్యంగా మందార ఆకు, మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు కలిపి ప్యాక్‌గా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి కనీసం ఒక్కసారైన అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది.

తలకు అప్లై చేసే ఆయిల్స్ ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవాలి. జుట్టు రాలిపోయే సమస్య తీవ్రంగా ఉంటే దాల్చిన చెక్క ఆయిల్‌ను తలకు అప్లై చేయాలి. దీనిని సహజంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. మీ తలకు సరిపడా ఆలివ్ ఆయిల్‌లో దాల్చిన చెక్క వేసి 5నిమిషాల పాటు మరగనివ్వాలి. చల్లార్చిన తర్వాత దీనిని వడపోసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి, 10 నిమిషాలు మసాజ్ చేయాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కేవలం ఆలివ్ ఆయిల్‌తోనే చేయాలని లేదు. మీరు తలకు అప్లై చేసిన నూనెతో కూడా ఇలా చేయవచ్చు. వారానికి ఒకసారి ఇలా చేసినట్లయితే జుట్టు దృఢంగా మారుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్‌తో మీ జుట్టు బలంగా పెరుగుతుంది. దీంతో పాటు హెయిర్ డ్యామేజ్‌ను నివారించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper