Nagarjuna Akkineni
Nagarjuna: మన టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చెయ్యని హీరో అంటూ ఇప్పుడు ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీడియం రేంజ్ స్థాయి ఉన్న హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేసేస్తున్నారు. బాహుబలి, #RRR వంటి చిత్రాలు మన టాలీవుడ్ స్థాయి ని ఆ రేంజ్ లో పెంచాయి కాబట్టే ఈ రేంజ్ మార్కెట్ మన అందరికీ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ అక్కినేని నాగార్జున వల్ల మన తెలుగు సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో మొట్టమొదటిసారి గుర్తింపు లభించింది అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నాగార్జున టాలీవుడ్ ఆడియన్స్ చిరస్థాయిగా గుర్తించుకోదగ్గ సినిమాలు చాలానే చేసాడు. ‘శివ’ చిత్రం అయితే మేకింగ్ లో మన టాలీవుడ్ దర్శకుల ఆలోచనలే మార్చేసింది. అలాగే ఎన్టీఆర్ తర్వాత భక్తి రస చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఏకైక హీరోగా నాగార్జున కి మంచి గుర్తింపు ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే ఆయన హీరో గా నటించిన ‘శివ’ చిత్రం తెలుగు లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో, హిందీ లో కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత నాగార్జున కి హిందీలో విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. అక్కడ వరుసగా ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. అంతే కాకుండా అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ తో కలిసి ఆయన మల్టీ స్టార్రర్ చిత్రాలు కూడా చేసాడు. అలా ఆ రోజుల్లోనే ఆయన మన టాలీవుడ్ నుండి గుర్తింపు పొందిన సూపర్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం హిందీలో మాత్రమే కాదు, తమిళం లో కూడా నాగార్జున కి అప్పట్లో మంచి పేరొచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘గీతాంజలి’ చిత్రం అప్పట్లో తెలుగులో వసూళ్ల సునామీని సృష్టించింది. కానీ గమ్మత్తు ఏమిటంటే తెలుగులో కంటే కూడా ఈ సినిమా తమిళంలోనే పెద్ద హిట్ అయ్యింది.
ఆ తర్వాత నాగార్జున హీరో గా నటించిన పలు తెలుగు సినిమాలను దబ్ చేసి తమిళం లో విడుదల చేయగా అవి కూడా పెద్ద హిట్ అయ్యాయి. తమిళంలో ఆయనకీ వచ్చిన క్రేజ్ ని చూసి కేటీ కుంజుమోన్ అనే ప్రముఖ నిర్మాత ఆరోజుల్లోనే 15 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ‘రక్షకుడు’ అనే చిత్రం తీసాడు. డైరెక్ట్ గా తమిళం లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల చేశారు. రెండు భాషల్లోనూ ఫ్లాప్ అయ్యింది కానీ నాగార్జున కి మంచి గుర్తింపు వచ్చింది. నాగార్జున కి ఇతర భాషల్లో మంచి సక్సెస్ రావడంతో చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసారు. వీరిలో చిరంజీవి సక్సెస్ అయ్యాడు కానీ వెంకటేష్ మాత్రం కాలేకపోయాడు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Did our tollywood get pan indian market because of nagarjuna