Natural Remedies to Stop Hair Fall: నేటి కాలంలో మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొన్ని రకాల రసాయనాలు వాడుతూ ఉండడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వయసు తీరిన తర్వాత మాత్రమే జుట్టు రాలిపోయేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు రాలిపోయి బట్ట తల వస్తుంది. 30 ఏళ్ల లోపు వారికే బట్టతల రావడంతో యువత తీవ్రంగా ఆందోళన చెందుతుంది. అయితే జుట్టు రాలడానికి నీటి కాలుష్యంతో పాటు శరీరంలో పోషకాహార లోపమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే..?
గుడ్లు:
కోడిగుడ్లు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించే అవకాశం ఉంది. ఇందులో కెరటిన్ అనే ప్రోటీన్ తయారవుతుంది. ఇది తినడం వల్ల జుట్టుకు జుట్టుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే కోడిగుడ్లలో విటమిన్ డి, విటమిన్ ఈ, సెలీనియం వడ్డీ పోషకాలు ఉంటాయి. వీటితో జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు. అందువల్ల ప్రతిరోజు లేదా వారానికి కనీసం మూడు కోడి గుడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెబుతున్నారు.
పాలకూర:
మార్కెట్లో పాలకూర విరివిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దానిని చాలామంది పట్టించుకోరు. పాలకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రెగ్యులర్ గా పాలకూర తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును దుమ్ము, ధూళి నుంచి రక్షిస్తాయి. అందువల్ల జుట్టు సమస్య ఉన్నవారు పాలకూరను ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలని వైద్యులు చెబుతున్నారు.
Also Read: వారంలో ఒక్కసారైనా చామదుంపలు ఎందుకు తినాలి?
అవిసెలు:
జుట్టు రాలే సమస్య ఉన్నవారికి అవిసెలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో ఉన్న విటమిన్ లో జుట్టు పోషణకు సహాయపడతాయి. అలాగే ఒత్తుగా జుట్టు పెరగడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. అవిసె గింజలను నేరుగా తీసుకోవచ్చు. లేదా పొడిగా చేసి తీసుకునే ప్రయత్నం చేయాలి. సలాడ్లో వీటిని ఎక్కువగా కలుపుతూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల కూడా ఉపయోగంగా ఉంటుంది. వేసవి కాలంలో కొన్ని రకాల ద్రవాల్లోనూ అవిసెలు వేసి తీసుకుంటూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
బాదం:
చుట్టూ రాలడాన్ని బాదం అరికడుతుంది. బాదంలో విటమిన్ బి7 ఉంటుంది. ఇది జుట్టు పెరిగేందుకు ఎక్కువగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జుట్టుకు సహాయకారిగా ఉంటుంది. అలాగే బాదం లో ఉండే మెగ్నీషియం జుట్టును బలంగా ఉంచుతుంది. బాదం లో ఉండే ప్రోటీన్ జుట్టును మృదువుగా ఉంచేలా చేస్తుంది.
ఇలా జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే జుట్టు రాలే సమస్య తీవ్రంగా ఉండి లేదా.. ఇతర సైడ్ ఎఫెక్ట్ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.