Good News For Sugar Patients: ప్రస్తుతం మధుమేహం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏటికేడు షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఎంతో మంది దాని ప్రభావానికి గురవుతున్నారు. సరైన వ్యాయామం, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో మధుమేహం రోజురోజుకు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఫలితంగా వారి ఆయువు తీస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మధుమేహగ్రస్తులుగా మారిపోతున్నారు. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదుపులేని మధుమేహంతో అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధుల్లో ఇదొకటి కావడం గమనార్హం. భవిష్యత్ లో ఇంకా మధుమేహ రోగులు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహ రోగులుగా ఉన్నట్లు వెల్లడించింది. ఏటా దాదాపు 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. అయినా ప్రజల్లో జాగ్రత్తలు కానరావడం లేదు. దీంతో షుగర్ తో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మన శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించకపోతే ఇంకా ఎన్నో దుష్ఫరిణామాలు చోటుచేసుకుంటాయి. షుగర్ ను అదుపులో ఉంచకపోతే ఇబ్బందులే వస్తాయనంలో సందేహం లేదు.
మారుతున్న జీవనశైలి మధుమేహం రావడానికి ప్రధాన కారణమవుతోంది. షుగర్ ను నియంత్రించే పదార్థాలు మన వంట గదిలోనే ఉన్నా మనం వాటిని వాడటం లేదు. దీంతో మధుమేహం నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించడంలో ఉల్లిపాయ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసినా కూడా మనం ఉల్లిని సరిగా వాడటం లేదు. శాన్ డియాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనంలో పలు విషయాలు వెలుగు చూశాయి. రక్తంలో చక్కెర స్థాయిలను 50 శాతం తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉల్లిపాయలో ఉన్నాయని చెబుతున్నారు.
ఇందుకుగాను ఎలుకలను ప్రయోగత్మకంగా తీసుకుని వాటిలో చక్కెర స్థాయిలను తగ్గించడమెలాగో అని పరిశోధనలు చేస్తున్నారు. ఉల్లిపాయ బల్బ్, అల్షియం సెపా, యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్ ఫార్మిన్ తో ఇచ్చినప్పుడు డయాబెటిక్ ఎలుకలలో రక్తంలో అధిక గ్లూకోజ్ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లి వాడకం మధుమేహులకు మంచిదని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతున్నాయని వెల్లడవుతోంది. దీంతో ఉల్లి షుగర్ ను నియంత్రణలోకి తెస్తుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అందుకే ప్రతి రోజు ఉల్లి వాడుకుంటే షుగర్ అదుపులో ఉండటం సాధారణంగా జరుగుతుంది.
మనం తీసుకునే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది. అన్నం తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇది తెలిసినా ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. డైట్ ఫాలో కావడం లేదు. ఫలితంగా అనేక రోగాలకు మూల కారణాలుగా నిలుస్తున్నారు. జీవనశైలిని మార్చుకుంటే మధుమేహం నియంత్రణలో ఉండటం పెద్ద విషయమేమీ కాదు. వైద్యుల సలహా ప్రకారం మన అలవాట్లు మార్చుకుంటే షుగర్ తగ్గిపోవడం ఖాయం.