https://oktelugu.com/

Car Millage: మైలేజ్ ఎక్కువగా రావాలంటే ఈ టిప్స్ తప్పక పాటించండి..

Car Millage: కారు ఎక్సీలేటర్ ను వేగంగా పెడలింగ్ చేయడం వల్ల మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. హెచ్చు, తగ్గులు ఎక్కువగా ఉండడం వల్ల మైలేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది. డ్రైవింగ్ కామన్ గా ఉండడం వల్ల మంచి మైలేజ్ వస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 27, 2024 2:30 pm
    Alto K 10 Milage Car

    Alto K 10 Milage Car

    Follow us on

    Car Millage:  వివిధ అవసరాల నిమిత్తం ఎంతో ఉత్సాహంగా కారును కొనుగులు చేస్తారు. కానీ దాని మెయింటనెన్స్ లో మాత్రం చాలా పొరపాట్లు చేస్తారు. కారు కొనుగోలు చేసేవవరకు డ్రైవింగ్ ఎక్సీపీరియన్స్ ఉంటే పర్వాలేదు. కానీ కొత్త డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ (Car Tips) గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారు మాత్రం వీటి గురించి తెలుసుకోవాలి. ఆ టిప్స్ ఏంటంటే?

    కారు కొనే మందు కొందరికి డ్రైవింగ్ గురించి తెలిసి ఉంటుంది. మరికొందరు కారు కొనుగోలు చేసిన తరువాత నేర్చుకుంటారు. అయితే ఎక్సీపీరియన్స్ ఉన్న వారు కారును ఎలా వాడాలో తెలుసుకొని వెహికల్ ను జాగ్రత్తగా చూసుకుంటారు. దీంతో ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కొత్తగా కారు నడిపేవారు ఇష్టమొచ్చిన రీతిలో డ్రైవింగ్ చేస్తుంటారు. దీంతో మైలేజ్ ఇవ్వకపోగా ఇంజిన్ త్వరగా దెబ్బతింటుంది. దీంతో తీవ్ర నిరాశకు గురవుతారు.

    కారు వాడే వారు తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం హై రైడర్ చేసేవాళ్లు ఎక్స్ లేటర్, బ్రేక్ తక్కువ సార్లు ఉపయోగించేలా చూసుకోవాలి. అంటే ఒకే రీతిలో సాఫీగా వెళ్లాలి. దీంతో ఈ ప్రభావం ఇంజిన్ పై పడకుండా ఉంటుంది.

    గంటల తరబడి ఒకే చోట కారు ఆగినప్పుడు కారును ఆఫ్ చేయడం మంచిది. ఆన్ లోనే ఉంచడం వల్ల కారు వేడి కావొచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ లో ఆగినప్పుడు సైతం కారును ఆప్ చేయడం మంచిది. అలాగే ట్రాఫిక్ లో ముందున్న వాహనాలకు చాలా వరకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.

    కారు ఎక్సీలేటర్ ను వేగంగా పెడలింగ్ చేయడం వల్ల మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. హెచ్చు, తగ్గులు ఎక్కువగా ఉండడం వల్ల మైలేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది. డ్రైవింగ్ కామన్ గా ఉండడం వల్ల మంచి మైలేజ్ వస్తుంది.

    కారు టైర్లు బాగా లేకపోవడం మైలేజ్ పై ప్రభావం పడుతుంది. కారు టైర్లు నాణ్యత లేకుండా ఉండడం వల్ల స్లో రన్ అవుతుంది. దీంతో మైలేజ్ తగ్గుతుంది.

    కారులోని ఏసీని వాతావరణాన్ని భట్టి ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. చల్లని వాతావరణంలోనూ ఏసీని ఆప్ చేసుకోవడం వల్ల మైలేజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.