https://oktelugu.com/

వానాకాలంలో అస్సలు తినకూడని ఆహార పదార్థాలు

వర్షాకాలం అంటేనే రోగాల సీజన్. ఈ కాలం నీరు కలుషితమవుతుంది. దోమలు, ఈగలు పెరిగి రోగాలు వ్యాపిస్తాయి. పారిశుధ్య లోపంతో అస్వస్థతకు గురి అవుతారు. ఈ క్రమంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదీ.. ముఖ్యంగా తినే తిండి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో వైరల్ జ్వరాలు, విరేచనాలు, జలుబు, దగ్గు, చలిజ్వరం, సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. కరోనా వేళ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇదీ.. వానాకాలంలో వీధుల్లో అమ్మే బజ్జీలు, మిర్చీలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2021 / 01:31 PM IST
    Follow us on

    వర్షాకాలం అంటేనే రోగాల సీజన్. ఈ కాలం నీరు కలుషితమవుతుంది. దోమలు, ఈగలు పెరిగి రోగాలు వ్యాపిస్తాయి. పారిశుధ్య లోపంతో అస్వస్థతకు గురి అవుతారు. ఈ క్రమంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదీ.. ముఖ్యంగా తినే తిండి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

    ఈ కాలంలో వైరల్ జ్వరాలు, విరేచనాలు, జలుబు, దగ్గు, చలిజ్వరం, సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. కరోనా వేళ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇదీ..

    వానాకాలంలో వీధుల్లో అమ్మే బజ్జీలు, మిర్చీలు, ఇతర ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకండి.. అపరిశుభ్రంగా ఉండే ఉండే ఈ ఆహారం వల్ల వానాకాలంలో మరింతగా ప్రమాదం..

    ఇక ఆకుకూరలు కూడా ఈ కాలంలో తినవద్దు. ఎందుకంటే వానలతో తేమ బాగా చేరి బ్యాక్టీరియా, ఫంగస్ లు ఆకుకూరలు, పండ్లపై వృద్ధి చెందుతాయి. అందుకే ఈ కాయంలో పండ్లు, ఆకుకూరలను బాగా కడిగి తినాలి.

    అస్సలు ఆయిల్ ఫుడ్ కు ఈ వానాకాలంలో దూరంగా ఉంటే మంచిది. లేదంగా విరేచనాలు, అజీర్తి సమస్య తలెత్తుతుంది. సమోసాలు, హాట్ హాట్ చిప్స్ తినవద్దు..

    ఇక చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు పునరత్పత్తికి వానాకాలమే మంచి సీజన్. అందుకే ఈ కాలంలో వాటిని తినకపోవడమే మంచిది.

    తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు మాత్రమే ఈ కాలంలో తినాలి.. అలాగే నీటిని కాచి వడబోసి మాత్రమే తాగాలి. బాగా ఉడికించి తింటే ఏం ప్రమాదం ఉండదు.