Health Tips : మద్యం తాగకపోయినా.. ఇవి తింటే లివర్ దెబ్బతింటుంది..వీటికి దూరంగా ఉండండి

మద్యం కంటే డేంజరస్ పదార్థాలు చాలా ఉన్నాయి. వాటిని డైలీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరికైనా లివర్ దెబ్బతింటే ఎక్కువ మద్యం సేవిస్తున్నావు. అందుకే లివర్ దెబ్బతిన్నదని అంటుంటారు. మరి మద్యం తాగని వాళ్లలో లివర్ దెబ్బ తింటుంది. దీనికి కారణం డేంజర్ ఫుడ్స్ తీసుకోవడం.

Written By: NARESH, Updated On : August 29, 2024 11:32 am

Eating This Foods Liver Gamage

Follow us on

Health News :  మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయిన పట్టించుకోకుండా ఎక్కువ శాతం మంది మద్యం సేవిస్తారు. అయితే మద్యం తాగేవాళ్లతో పోలిస్తే.. తాగని వాళ్లు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణం వాళ్లు తీసుకునే ఆహారం. కేవలం మద్యం మాత్రమే కాదండోయ్.. మద్యం కంటే డేంజరస్ పదార్థాలు చాలా ఉన్నాయి. వాటిని డైలీ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరికైనా లివర్ దెబ్బతింటే ఎక్కువ మద్యం సేవిస్తున్నావు. అందుకే లివర్ దెబ్బతిన్నదని అంటుంటారు. మరి మద్యం తాగని వాళ్లలో లివర్ దెబ్బ తింటుంది. దీనికి కారణం డేంజర్ ఫుడ్స్ తీసుకోవడం. అయితే ఆల్కహాల్ కన్న డేంజరస్ ఆహార పదార్థాలు ఉన్నాయా? వాటివల్ల లివర్ దెబ్బతింటుందా? ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈరోజు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

తక్కువగా నీరు తాగడం
రోజుకి సరిపడా నీరు ప్రతి ఒక్కరూ తాగాలి. కానీ చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటున్నారు. నీరు తాగినట్లు మద్యం సేవిస్తున్నారు. నీరు తక్కువగా తాగితే ఆ ప్రభావం కాలేయంపై పడుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయడానికి బాడీకి ఫుల్‌గా నీరు అవసరం. సరైన మోతాదులో నీరు తాగాలి. తక్కువగా తీసుకుంటే కాలేయ సమస్యలు వస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. నీరు, పండ్లు, జ్యూస్‌లు తప్పనిసరి.

ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టంగా తింటారు. అయితే వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు కాలేయం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపలను ఇలా నూనెలో ఫ్రై చేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఫ్రైడ్ చికెన్
చికెన్‌లో ప్రొటీన్స్ అన్ని అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా మాత్రమే తినాలి. అయితే ఈ మధ్య కాలంలో చికెన్‌లో చాలా రకాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఫ్రైడ్ చికెన్‌‌ను ఎక్కువగా తింటున్నారు. ఎక్కువగా నూనెలో వేయించిన దీనిని తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. వీటితో పాటు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఫుడ్‌ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిసున్నారు.

షుగర్ పదార్థాలు ఎక్కువగా తింటే?
అధిక చక్కెర ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల బాడీలో కొవ్వులు పెరుగుతాయి. దీంతో కాలేయం దెబ్బ తింటుంది. ఆల్కహాల్ కంటే షుగర్ అత్యంత హానికరం. ఆర్టిఫిషియల్ షుగర్, క్యాండీలు, పేస్ట్రీలు, శీతల పానీయాలు వంటివి కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అయితే వీటితో పాటు మానసికం ఆరోగ్యం కూడా బాగుండాలి. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా సంతోషంగా ఉండాలి. మానసికంగా ఇబ్బంది, ఒత్తిడి కూడా కాలేయ సమస్యలకు దారితీస్తుంది.