https://oktelugu.com/

Tortoise Ring : తాబేలు ఉంగరం ధరించవచ్చా? ఏ వేలికి ధరిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయంటే?

సాధారణంగా ఉంగరాన్ని ఏ రోజైన కొనేస్తారు. కానీ తాబేలు ఉంగరాన్ని మాత్రం ఇలా కొనకూడదు. ధరించకూడదు. కేవలం శుక్రవారం రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనాలి. వెంటనే ఈ ఉంగరాన్ని పెట్టుకోకూడదు. ఇంట్లో దాన్ని పాలు, గంగా జలంలో కొన్ని రోజులు ఉంచాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2024 / 01:31 AM IST

    Tortoise Ring

    Follow us on

    Tortoise Ring: తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే అందరూ బాగుండటంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు. శుభానికి గుర్తుగా తాబేలు బొమ్మను వాడుతారు. అయితే కేవలం తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్లే కాకుండా.. తాబేలు ఉంగరాన్ని చేతికి ధరించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. వేలికి తప్పకుండా తాబేలు ఉంగరం ఉంటే శుభ చిహ్నంగా భావిస్తారు. ఈ ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. అయితే ఈ ఉంగరం ధరించిన వాళ్లు ఈ తప్పులు చేయకుండా కొన్ని నియమాలు పాటించాలి. అయితే కొంతమందికి తెలియక తాబేలు ఉంగరం ధరించినప్పుడు చిన్న తప్పులు చేస్తుంటారు. దీనివల్ల చెడు ఫలితాలను అనుభవిస్తారు. అదే నియమాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు పాటించే నియమాలేంటి? ఏ వేలికి ధరించడం వల్ల మెరుగైన ఫలితాలను చూడవచ్చు? వంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం.

    సాధారణంగా ఉంగరాన్ని ఏ రోజైన కొనేస్తారు. కానీ తాబేలు ఉంగరాన్ని మాత్రం ఇలా కొనకూడదు. ధరించకూడదు. కేవలం శుక్రవారం రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని కొనాలి. వెంటనే ఈ ఉంగరాన్ని పెట్టుకోకూడదు. ఇంట్లో దాన్ని పాలు, గంగా జలంలో కొన్ని రోజులు ఉంచాలి. ఆ తర్వాత పూజ చేసి.. గురువారం లేదా శుక్రవారం మాత్రమే ధరించాలి. అలాగే దీపావళి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజు ఈ ఉంగరం ధరించడం చాలా మంచిది. ఈ ఉంగరాన్ని మధ్య వేలికి లేదా చూపుడు వేలికి మాత్రమే ధరించాలి. తాబేలు ఉంగరాన్ని వ్యతిరేక దిశలో ధరించకూడదు. తల భాగం మీ వైపుకు ఉండేట్లు చూసుకోవాలి. అయితే అన్నింటి కంటే వెండితో చేసిన తాబేలు ఉంగరం ధరించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ చేరుతుంది.

    లక్ష్మీ దేవికి ప్రతీకగా తాబేలును చూపిస్తారు. ఈ తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లయితే అవన్నీ సర్దుమనిగి శాంతి చేకూరుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న తొందరగా తీరిపోతాయి. వ్యాపారంలో నష్టాలను చూసిన వాళ్లు ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల లాభాలను చూస్తారు. ఈ ఉంగరం వల్ల అన్నింట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తాబేలు ఎలా మెల్లిగా పురోగతి సాధిస్తుందో.. జీవితంలో కూడా మీరు అలానే పురోగతి సాధిస్తారు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల వ్యక్తిలో విశ్వాసం, నమ్మకం అన్ని రెట్టింపు అవుతాయి. అయితే కొంతమందికి ఈ ఉంగరం సెట్ కాదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ధరించే ముందు పండితులను అడిగి ధరించడం మేలు.