Vasthu Tips : ఇంట్లో తాబేలు బొమ్మను ఏ దిక్కున పెట్టుకుంటే.. అదృష్టం కలిసి వస్తుంది

సాధారణంగా అందరి ఇంట్లో క్రిస్టల్ తాబేలు బొమ్మ కనిపిస్తుంది. అయితే కొందరు గాజు తాబేలు బొమ్మను కూడా పెట్టుకుంటారు. ఈ తాబేలు బొమ్మను నైరుతి లేదా ఈశాన్యంలో పెడితే అదృష్టం వరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొంతమంది వాయువ్యంలో కూడా ఈ తాబేలును పెట్టవచ్చని చెబుతుంటారు.

Written By: Bhaskar, Updated On : August 29, 2024 11:01 am

Vasthu Tips

Follow us on

Vasthu Tips  : చాలామంది ఇంట్లో మీరు తాబేలు బొమ్మ చూసే ఉంటారు. అయితే ఈ తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. తాబేలు బొమ్మ ఇంట్లో ఉండటం వల్ల అనుకున్నవి జరుగుతాయని, ఇంటికి అదృష్టం వస్తుందని చాలా మంది భావిస్తారు. కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారాల్లో కూడా వీటిని పెడుతుంటారు. మళ్లీ ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. గాజు, క్రిస్టల్, చెక్క ఇలా ఉంటాయి. ఎక్కువ శాతం మంది గాజు లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను వాడుతుంటారు. వీటిని వాడితేనే మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. ఇంటికి అదృష్టం రావడంతో పాటు సంపద కూడా సృష్టిస్తుందని చాలా మంది నమ్మకం. అయితే నిజంగానే ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే అదృష్టం కలిసి వస్తుందా? మరి ఏ దిక్కున ఈ తాబేలు బొమ్మను పెట్టాలి? వీటి వల్ల కలిగే ఫలితాలేంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

సాధారణంగా అందరి ఇంట్లో క్రిస్టల్ తాబేలు బొమ్మ కనిపిస్తుంది. అయితే కొందరు గాజు తాబేలు బొమ్మను కూడా పెట్టుకుంటారు. ఈ తాబేలు బొమ్మను నైరుతి లేదా ఈశాన్యంలో పెడితే అదృష్టం వరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొంతమంది వాయువ్యంలో కూడా ఈ తాబేలును పెట్టవచ్చని చెబుతుంటారు. ఇంట్లో తాబేలు ఈ మూలన ఉంటే విజయం, అదృష్టం వస్తాయని చాలా మంది నమ్ముతారు. వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలంటే నల్ల తాబేలును ఉంచుకోవాలి. దీన్ని ఉత్తరం వైపు పెడితే మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది ఈ తాబేలు బొమ్మను అక్వేరియం దగ్గర పెడుతుంటారు. దీనివల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. తాబేలు బొమ్మను నీటిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

లోహపు తాబేలు ఇంట్లో ఉండటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అది కూడా ఉత్తరం లేదా వాయువ్వంలో ఉంచడం వల్ల పిల్లలు చదువులో అభివృద్ధి సాధిస్తారు. అలాగే ఇంటికి అదృష్టం వరిస్తుంది. తాబేలు నాణేలు పట్టుకున్నట్లు ఉన్న బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే కుటుంబ ఆరోగ్యం మంచిగా ఉండటంతో పాటు సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఇంటి ఈశాన్యంలో లేదా తూర్పున చెక్క తాబేలును పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మెరుగుపడతాయి. తాబేలు బొమ్మ ఇంట్లో ఉండటం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకు క్రమశిక్షణను ఇస్తుంది. ముఖ్యంగా ఇంటి ద్వారానికి తాబేలు బొమ్మ పెడితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. మరి మీ ఇంట్లో తాబేలు బొమ్మ ఉందా? ఉంటే ఏ దిక్కున పెట్టారు? ఎలాంటి ఫలితాలు మీరు చూస్తున్నారో కామెంట్ చేయండి.