Energy Recovery: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. అందుకు ప్రధాన కారణం కల్తీ ఆహారం.. వాతావరణ కాలుష్యం లాంటివి ఉన్నాయి. వీటితోపాటు చాలామంది సరైన నిద్ర పోకపోవడమే కారణమని కూడా కొందరు వైద్యులు చెబుతున్నారు. వివిధ కారణాలవల్ల కొంతమంది సరైన నిద్రపోవడం లేదు. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అలసటతో పాటు అనేక సమస్యలు వచ్చి అనారోగ్యానికి గురవుతున్నారు. వీరిలో చిన్న పిల్లలతో సహా వృద్ధులు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగం, వ్యాపారం చేసే వారికి సరైన నిద్ర లేకపోతే విధులు సక్రమంగా నిర్వర్తించలేరు. ఇలాంటి సమయంలో కొన్ని టిప్స్ పాటించాల్సిన అవసరం ఉంది. వీటిలో ‘పవర్ న్యాప్’ ఒకటి. ఇటీవల కొత్తగా వినిపిస్తున్న ‘పవర్ న్యాప్’ నువ్వు ఫాలో అయితే ఎంతో ఎనర్జీ వస్తుంది. ఇంతకీ ‘పవర్ న్యాప్’అంటే ఏమిటి? అసలు ఏం చేయాలి?
Also Read: మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది.. అందుకు నిదర్శనమే ఇది..
కొన్ని కారణాలవల్ల రాత్రులు సరైన నిద్రలేక భాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. మరి కొంతమంది మొబైల్ లేదా టీవీ చూస్తూ నిద్రను చెడగొట్టుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఎలాగైనా రాత్రి నిద్ర లేకపోతే ఆ మరుసటి రోజు అలసటగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు తమ పని స్థలాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ‘పవర్ న్యాప్’ ను పాటించాలి. దీనిని పాటిస్తే సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉండగలుగుతారు.
‘పవర్ న్యాప్’ అంటే కాసేపు కునుకు తీయడం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిద్రపోయే విధానాన్ని ‘పవర్ న్యాప్’ అని అంటారు. ఒక ఉద్యోగి తన కార్యాలయంలో నిద్ర కరువై ఇబ్బందులు పడుతున్నప్పుడు..విశ్రాంతి గదిలోకి వెళ్లి 15 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల ఎంతో ఎనర్జీగా ఉండగలుగుతారు. ఇలా కునుకు తీయడం వల్ల శరీరంలో అనుకోకుండానే ఎనర్జీ వస్తుంది. దీంతో ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా అప్పటివరకు బరువుగా ఉన్నా మనసు తేలిక అవుతుంది. దీంతో మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలతో తర్వాతి విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అయితే ఈ ‘పవర్ న్యాప్’ అవకాశం ఉన్నవారు మాత్రమే చేయాలి. విధులు పక్కన పెట్టి మరీ చేయాలని కుదరదు.
Also Read: మీ పిల్లలు ఇలా చేస్తున్నారా? తప్పు మీదే.. ఎలాగంటే?
‘పవర్ న్యాప్’ అనేది మధ్యాహ్నం మాత్రమే చేయాలి. ఈ సమయంలో కనీసం 15 నిమిషాల పాటు గాఢ నిద్రపోతే అవసరమైన శక్తి అందుతుంది. అయితే ఇదే అతనుగా కొందరు గంటల కొద్ది నిద్ర పోవాలని చూస్తారు. అలా చేస్తే మళ్లీ సమస్యలను తెచ్చుకున్నట్లే. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో ఎక్కువ సేపు నిద్రిస్తే లేజీ అవుతారు. అప్పటివరకు ఉన్న ఉత్సాహం మాయమైపోతుంది. అలా కాకుండా కేవలం 15 నిమిషాలు మాత్రమే కునుకు తీసే ప్రయత్నం చేయాలి. కొంతమంది కార్యాలయాల్లో దీనిని ఉపయోగించుకొని ఉత్సాహం తెచ్చుకొని మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారు. అంతేకాకుండా చాలామంది లంచ్ అయిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇది ఉపయోగకరమైన అని వైద్యులు చెబుతున్నారు.