Child Behavior Issues : పట్టుమని పదేళ్లు కూడా లేని ఒక పిల్లవాడు నోట్లో సిగరెట్ పెట్టుకొని కనిపిస్తున్నాడు.. మీసాలు కూడా రానీ కొందరు డ్రగ్స్ కు బానిసగా మారి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. కనీసం 20 ఏళ్ళు రానివారు హత్యలు చేయడానికి వెనుకాడడం లేదు.. ఇలా సగం జీవితం కూడా పూర్తిగాని వారు తమ స్థాయికి మించిన పనులు చేస్తున్నారు. అందుకు సమాజం కారణం అని కొందరు అంటుంటే.. వారి పెంపకమే కారణమని మరికొందరు వాదిస్తున్నారు.. వారు చదివిన విధానం బాగాలేదని ఇంకొందరు దూషిస్తున్నారు. అసలు వీళ్లు ఇలా తయారు కావడానికి కారణం ఏంటి? వారు మొదట ఇలాంటి విషయాలను ఎక్కడ నేర్చుకుంటారు?
Also Read: రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా? అందుకేగా ఈ రోగాలు!
ప్రతి ఒక్క వ్యక్తి కి మొదటి గురువులు తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లేని వారి గురించి పక్కన పెడితే ఉన్నవారు తమ పిల్లలను ఎలా పెంచాలి అనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇద్దరు ఉద్యోగులు చేయడం.. లేదా తమ గొడవల కారణంగా పిల్లలపై ప్రభావం చూపడం వంటివి పిల్లల మనస్తత్వాలపై తీవ్రంగా పడుతుంది. దీంతో వారి జీవితాల్లో అనేక మార్పులు జరిగి తప్పుడు దారులు పడుతున్నారు.
మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తాము బాగానే పెంచుతున్నాం అని అనుకుంటూనే కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. కొందరైతే వెనకటి పద్ధతులను పాటిస్తూ పిల్లలను కన్ఫ్యూజ్ లో పడేస్తున్నారు. అసలు తల్లిదండ్రులు చేయాల్సిన ప్రధాన విధులు ఏంటి? ఏం చేస్తే పిల్లలు కొంతవరకైనా మంచి దారిలో వెళ్తారు?
Also Read: ఉత్సాహంగా పని.. ఆనందంగా జీవితం.. ఈ దేశాన్ని చూసి నేర్చుకోవాలి..
ఒకప్పుడు పిల్లలు బడికి వెళ్లేవారు కాదు. దీంతో తల్లిదండ్రులు వారిని భయపెట్టో.. బాధ పెట్టో.. అవసరమనుకుంటే దండించో వారిని స్కూలుకు పంపేవారు. కానీ నేటి కాలంలో అలాంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు. వారిని చూపించి మిగతా వారిని స్కూలుకు పంపిస్తున్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ కుమారులను లేదా కుమార్తెలను ఇంకా దండిస్తూ స్కూలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా స్కూలుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో వారికి నచ్చ చెప్పాలి. అప్పుడే వారికి స్కూలుపై ఇష్టం ఏర్పడుతుంది.
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకోరు. వారు కొన్ని విషయాలను పదేపదే అడుగుతూ ఉంటారు. అలా వారు అడుగుతున్నారని విసిగిచ్చుకోకుండా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ఓపికని తెచ్చుకోవాలి. ఎందుకంటే వారికి తమ తల్లిదండ్రులు సమాధానం చెప్పలేక పోతున్నారని అనుకుంటే వారు ఎలాంటి డౌట్స్ అడిగే ప్రయత్నం చేయరు. దీంతో వారు లోలోపనే మదన పడుతూ ఉంటారు.
నేటి కాలంలో ఎక్కువగా పిల్లలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు ఒక కారణం ఒంటరితనం ఫీలవుడే. వారిని ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వకుండా స్నేహితులతో ఆడుకునే అవకాశం ఇవ్వాలి. వీలైతే వారితో కలిసి వీకెండ్ ట్రిప్ వేయాలి. అలా చేయడం వల్ల కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గితే చాలా ఇబ్బందులు పడతారు.