Nellore Politics Shift: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో( YSR Congress) మరో సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆ నేత.. అధినేత ఉద్దేశపూర్వకంగానే తనను దూరం పెడుతున్నారన్న అనుమానంతో ఉన్నారు. కనీసం పిలిచి మాట్లాడకపోవడం పై అసంతృప్తితో ఉన్నారు. పైగా తనను కనీసం సంప్రదించకుండా నియోజకవర్గ బాధ్యతలను వేరే నేతకు కట్టబెట్టడం పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
Also Read: Vallabhaneni Vamsi jail case: వల్లభనేని వంశీకి మళ్లీ జైలు భయం!
నేతలంతా సైలెంట్..
నవ్యాంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా( Nellore district ) రాజకీయాలది ప్రత్యేక స్థానం. ఆది నుంచి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం చవిచూసింది. ఎన్నికల కు ముందు చాలామంది నేతలు టిడిపిలోకి వెళ్లడంతో వైసీపీకి దెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత దారుణ పరాజయం ఎదురు కావడంతో వైసిపి ముఖ్య నేతలు సైతం సైలెంట్ అయ్యారు. అటువంటి వారిలో మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకరు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదాలకు కోటంరెడ్డి చేతిలో ఘోర పరాజయం ఎదురయింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖాన్ని చూడలేదు. దీంతో అక్కడ ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఆయననే పార్టీ పార్లమెంట్ పరిశీలకుడిగా కూడా నియమించారు. ఈ నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటూ హైదరాబాద్ కు పరిమితం అయ్యారు.
భూముల వ్యవహారంలో విమర్శలు..
అహోబిలం మఠం( Ahobilam matam ) భూముల విషయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కనీస స్థాయిలో కూడా మద్దతు లభించలేదు. దీంతో నెల్లూరు వచ్చిన ఆదాల మీడియా సమావేశం ఏర్పాటు చేసి అహోబిలం భూముల విషయంలో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే తనపై కూటమి ప్రభుత్వం నుంచి ఎదురుదాడి వస్తే.. కనీసం వైసిపి నుంచి అండగా నిలిచే వారు కరువయ్యారన్న ఆవేదన ఆదాలలో ఉంది. అందుకే పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్న ఆయన టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ టిడిపి నేతలు అడ్డుకోవడంతో ఇప్పుడు ఆదాల బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. బిజెపి హై కమాండ్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: JC Prabhakar Reddy viral: బండబూతులు.. జెసి ఇక మారడా!
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
కాంగ్రెస్ పార్టీ ( Congress Party)ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఆదాల. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్ ఇచ్చిన గెలవలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదాలకు నెల్లూరు పార్లమెంట్ సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లిపోవడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా ఆదాలను నియమించారు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆధాల ప్రభాకర్ రెడ్డి. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన టిడిపిలో చేరతారని తెగ ప్రచారం జరిగింది. అటు తర్వాత ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పుడు వైసీపీ నాయకత్వం తనను పట్టించుకోకపోవడంతో.. ఆదాల బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.