Humanity in People: కాలం మారుతున్న కొద్దీ మనుషుల మనసుల్లో తేడాలు ఉంటున్నాయని కొందరు అనుకున్నారు. కలికాలం ప్రారంభమై అధర్మం రాజ్యమేలుతుందని ఆవేదన చెందుతున్నారు. కానీ నేటి కాలంలో కూడా ఎక్కడో ఒకచోట మానవత్వం దాగి ఉందని తెలుస్తోంది. అందుకు కొన్ని సంఘటనలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక మనిషి ఆపదలో ఉంటే అతని ఫోటోలు లేదా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎంజాయ్ చేసే ఈ రోజుల్లో కూడా ఒక మనిషికి మరో మనిషి సహాయం చేస్తూ ఆదుకుంటున్నాడు అంటే అతిశయోక్తి కాదు. వరదలు, విపత్తులు ఏర్పడినప్పుడు ఎదుటివారిని ఆదుకునేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలా ఓ చిన్నారి విషయంలో కొందరు చేసిన సహాయం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని కొనియాడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో భారీ వర్షాల కురిసాయి. దీంతో వరదలు పొంగిపొర్లి ప్రవహించాయి. వరదల కారణంగా ఇండ్లు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని ప్వారా, తునాగు, బైద్షాద్, కందా, మురాద్ వాటి గ్రామాల్లో వరదలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో రమేష్, రాధాదేవి దంపతులు వరదల్లో కొట్టుకుపోయారు. వీరిలో ముందుగా రమేష్ కుమార్ వరద విపత్తులు గ్రహించి ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ క్షణాల్లోనే ఆయన కనిపించకుండా పోయారు. ఆ తర్వాత రాధాదేవి కుటుంబ సభ్యులను వెతకడానికి బయటకు వెళ్ళింది. కానీ ఆమె తిరిగి రాలేదు. ఇలా ఒక్కొక్కరుగా కొట్టుకుపోయారు. మొత్తంగా 14 మంది మరణించినట్లు.. 31 మంది కనిపించకుండా పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వీరిలో రమేష్ కుమార్, రాధాదేవిలా కూతురు నీతికా వరద నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి నితికా ఒంటరిగా ఉండి కేకలు పెట్టడాన్ని గమనించాడు.. దీంతో ఆమెను భద్రత అధికారి అయిన బల్వంత్ వద్దకు తీసుకు తీసుకువెళ్లాడు.
Also Read: నో’ చెప్పడం నేర్చుకో.. బాగుపడుతావ్..!
అయితే ఒంటరిగా మిగిలిన నీతికా కు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ బ్యాంకు ఖాతా తీరుస్తామని.. ఆమెకు సహాయం చేయాలని కోరాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నితికా కు సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అయితే ఆమె అత్తమ్మ తానే నీతి కాను పెంచుతానని తెలిపింది.
అయితే నితికా పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే అందులోకి చాలా విరాళాలు వచ్చాయి. అలా ఇప్పటివరకు రూ. 11 లక్షలు జమైనట్లు తెలుస్తుంది. ఇంకా కూడా సహాయం చేయడానికి చాలామంది బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఇలా నితికాకు అన్ని విధాల సహాయం అందడానికి చాలామంది ముందుకు రావడంతో ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక మనిషికి మరో మనిషి సహాయం చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం అని కొందరు కొనియాడుతున్నారు. అంతేకాకుండా మానవత్వం ఇంకా చచ్చిపోలేదని.. బతికే ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ సహాయం అన్ని సమయాల్లో ఉండాలని కొందరు కోరుతున్నారు. ఒకరు సహాయం చేస్తే మరొకరు కూడా ముందుకు వస్తారని ఇంకోసారి చెబుతున్నారు. ఏది ఏమైనా విపత్తులు ఏర్పడినప్పుడు మనుషులు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.