Mobile Side Effects: ఫోన్ ఇచ్చి పిల్లలను దునియా చూడకుండా చేస్తున్నారా? కళ్ళకు ఎంత ప్రాబ్లమో తెలుసా?

పిల్లలు మొబైల్ తరుచు చూడటం వల్ల వారి సున్నితమైన కన్నులు దెబ్బతింటాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటి డాక్టర్ల వద్దకు వచ్చే కేసుల్లో పది లో ఐదు ఇవే కేసులు అంటున్నారు నిపుణులు. పిల్లలు ఫోన్ చూస్తూ కనురెప్ప వేయడం కూడా మరిచిపోతుంటారు. అలా కనురెప్పలు ఆడించకపోతే కన్నులు పొడిబారి కంటిచూపు పాడువుతుందట. ఇంకా కండ్లు ఎప్పుడు పొడిగా ఉంటే కంటిలో నల్లటి గుడ్డు పలసబడి కండ్లు కనిపించవట.

Written By: Swathi, Updated On : July 10, 2024 12:29 pm

Mobile Side Effects

Follow us on

Mobile Side Effects: మీ పిల్లలకు ఫోన్ అలవాటు ఉందా? ఉంటే వెంటనే మానిపించండి. లేదా మీ పిల్లల బంగారం భవిష్యత్తు మీరే పాడుచేసినవారు అవుతారు. నేటి ఆధునిక జీవితంలో టెక్నాలజీ, ఇంటర్నెట్ అంటూ ఫోన్ ను కామన్ వస్తువుగా భావిస్తున్నారు. కాని ఆ ఫోన్ పిల్లలకు శాపంగా మారుతుంది. తల్లిదండ్రుల అతిప్రేమతో పిల్లల ఏడవగానే కొద్దీసేపే కదా అని ఇస్తుంటారు. ఇచ్చిన విషయం మరిచిపోయి మీపనిలో మీరుంటారు. ఫోన్ చూస్తూ పిల్లలు ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? అయితే అలా చేయకండి. అదే మీరు చేసే పెద్ద తప్పు.

పిల్లలు మొబైల్ తరుచు చూడటం వల్ల వారి సున్నితమైన కన్నులు దెబ్బతింటాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటి డాక్టర్ల వద్దకు వచ్చే కేసుల్లో పది లో ఐదు ఇవే కేసులు అంటున్నారు నిపుణులు. పిల్లలు ఫోన్ చూస్తూ కనురెప్ప వేయడం కూడా మరిచిపోతుంటారు. అలా కనురెప్పలు ఆడించకపోతే కన్నులు పొడిబారి కంటిచూపు పాడువుతుందట. ఇంకా కండ్లు ఎప్పుడు పొడిగా ఉంటే కంటిలో నల్లటి గుడ్డు పలసబడి కండ్లు కనిపించవట.

కండ్లపై లైట్ నేరుగా పడకూడదు ఇలా పడితే కళ్లుపోతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అదే విధంగా గ్రహనం రోజు చంద్రున్ని, సూర్యున్ని నేరుగా చూడవద్దు అంటారు. అంతేకాదు వెల్డింగ్ లైట్స్, ఫోన్ లైట్స్ ఇలా ఐ లైటింగ్ కళ్ల కు హానికరం. మొబైల్ స్క్రీన్ పై వచ్చే నీలి రంగులు కంటిలో ఉండే మాగ్యులర్ ను పాడు చేస్తాయట. ఇవి మళ్లీ తిరిగి రావడం కష్టమే. ఇక వయస్సు పెరిగిన కొద్దీ చాలా కంటి సమస్యలు వస్తుంటాయి.

మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం కళ్లు, ఆ కండ్లు లేకపోతే మనిషికి వెలుగు లేదు. అలాంటి పిల్లల కండ్లను మొబైల్స్, లాప్ స్టాప్స్, ఐపాడ్ లు ఇచ్చి నాశనం చేయకండి. వారి జీవితం అంధకారం చేయకండి. పిల్లలకు ఫోన్ ఇవ్వడం ద్వారా కంటి సమస్యతోపాటు ఇంకా ఎన్నో మానసిక సమస్యలు వస్తుంటాయి. పిల్లల మెమోరీ పవర్ కూడా తగ్గుతుంది. ఫోన్ అలవాటు అయినా పిల్లలు దానికి ఒకేసారి దూరం చేస్తే పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు. లేదా కొడతారు, తిడతారు. ఇలాంటి కేసులు రీసెంట్ గా నమోదయ్యాయి. అందుకే ఒకే సారి కాకుండా మెల్లిమెల్లిగా దూరం చేయండి.