Okkadu Movie: ఒక్కడు సినిమాకు ముందు అనుకున్న టైటిలే పెట్టుంటే అసలు ఎలా ఉండేదో ఊహించుకోగలరా…

Okkadu Movie: ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా బాగా హైలెట్ అని చెప్పచ్చు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయినా సంగతి తెలిసిందే.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్ బాబు.

Written By: Chai Muchhata, Updated On : July 10, 2024 12:57 pm

Did you know the title gunasekhar fix for okkadu cinema before it

Follow us on

Okkadu Movie: ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి.గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి ట్రెండ్ సెట్ చేసింది.ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మహేష్ బాబు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.ఇక హీరోయిన్ భూమిక చావ్లా,ప్రతి నాయకుడు పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా మంచి నటన కనపరిచారు.

ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా బాగా హైలెట్ అని చెప్పచ్చు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయినా సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్ బాబు. ఆ తర్వాత మహేష్ బాబు యువరాజు,బాబీ సినిమాలలో నటించడం జరిగింది.కృష్ణ వంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మురారి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు.

మురారి సినిమా తర్వాత యాక్షన్ డ్రామాగా వచ్చిన ఒక్కడు సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ కూడా అమాంతంగా పెరిగిపోయిందని చెప్పడంలో సందేహం లేదు.ఒక పక్క దర్శకుడు గుణశేఖర్ మృగరాజు సినిమాతో ప్లాప్ అందుకొని ఒక సాలిడ్ హిట్ కోసం కసి తో ఉన్నారు.ఇక అదే కసితో గుణశేఖర్ ఈ సినిమాలోని ప్రతి సీన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించారు.అయితే ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ ను అనుకున్నారట గుణశేఖర్.

ఒకసారి ఆయన పుల్లెల గోపీచంద్ గురించి పేపర్ లో చదువుతూ అస్సలు స్పోర్ట్స్ అంటే తన తండ్రికి ఇష్టమే లేని గోపీచంద్ ఎంతో కష్టపడి బ్యాట్మెంటన్ ఛాంపియన్ గా ఎదిగారు.ఈ కథ ఆధారంగా ఒక్కడు సినిమా కథను రాసుకున్నారు గుణశేఖర్.అయితే ఈ కథకు అతడే ఆమె సైన్యం అని టైటిల్ అనుకున్నారట.కానీ ఆ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో కబడ్డీ అనే టైటిల్ పెడదాం అనుకున్నారట.కానీ చివరకు ఒక్కడు అనే టైటిల్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.