Sorghum : ఏ రోగాలు రావు.. ఇది తింటే మీ ఆరోగ్యం మీ చెంతనే.. వెంటనే తెచ్చుకోండి

ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకోవచ్చు. అన్నింటిని కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి. వీటివల్ల ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.

Written By: NARESH, Updated On : August 17, 2024 10:14 pm

Sorghum

Follow us on

Sorghum : ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల ఆరోగ్య విషయంలో చాలామంది బాధపడుతున్నారు. దీంతో శరీరానికి బలాన్నిచ్చే ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. పూర్వ కాలంలో ఎక్కువగా గోధుమలు, జొన్నలు, కొర్రలు, రాగులు, సజ్జలతో చేసిన ఆహారాలను తినేవారు. వీటిని తినడం వల్ల బలంగా ఉండేవారు. అప్పుడున్న మనుషులు 70 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. కానీ ఈ రోజుల్లో 40 ఏళ్లకే అనారోగ్య బారిన పడుతున్నారు. దీనికి ముఖ్యకారణం మారిన జీవనశైలి. ఈతరం యువత ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్స్‌కి అలవాటు పడ్డారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిన్నింటి నుంచి బయటపడాలంటే పూర్వకాల పద్ధతులు పాటించాలి. అందుకే ఈరోజుల్లో చాలామంది ఆ పద్ధతులకే షిఫ్ట్ అయ్యారు. ఎక్కువగా ఈమధ్య జొన్న పిండిని ఉపయోగిస్తారు. వీటితో రోటీ, అంబలి, దోస వంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. జొన్నపిండితో చేసిన పదార్థాలను తినడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.

జొన్నల్లో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేస్తాయి. అదే విధంగా ఇందులో నియాసిన్, థయామిన్, రిబోప్లేవిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఇద జీవక్రియ నాడీ పనితీరును మెరుగు పర్చడంతో పాటు శక్తిని పెంచుతాయి. జొన్నల్లో అధికంగా ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్తానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో సాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎముకల్ని బలంగా చేసి బోలు ఎముకల వ్యాధి రాకుండా చేస్తుంది. జొన్నల్లోని ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ చేస్తుంది. వీటిని రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే బరువు కంట్రోల్ అవుతుంది. ఇవి షుగర్‌ను కంట్రోల్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ వాపు, కొలెస్ట్రాల్‌ స్థాయిలని తగ్గించడంలో సాయపడతాయి. వీటిని మీకు నచ్చిన విధంగా చేసుకుని తింటే క్యాన్సర్ వంటి సమస్యలు కూడా దరి చేరవు. అలాగే కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడి.. గుండె సంబంధిత సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.

జొన్నపిండితో రకరకాల వంటలను తయారుచేసుకోవచ్చు. కేవలం రోటీ, అంబలి మాత్రమే కాకుండా కొత్తగా ట్రై చేసి తినండి. జొన్నలతో వెజిటేబుల్ చిల్లా, పరాటా, ఉప్మా, లడ్డూ వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం జొన్నపిండితో చేసిన వాటిని తినలేకపోతే ఇందులో కొద్దిగా రాగులు, సజ్జలు, గోధుమలు కూడా యాడ్ చేయవచ్చు. ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకోవచ్చు. అన్నింటిని కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి. వీటివల్ల ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.