Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు శృంగారం చేస్తే మళ్లీ ప్రెగ్నెన్సీ వస్తుందా?

ఇలా ముందే అండం ఉండగా మళ్లీ విడుదల చేయడం వల్ల సూపర్ ఫెటేషన్ జరుగుతుంది. అయితే ఇది మామూలు గర్భం దాల్చిన వాళ్లలాగే సంకేతాలు ఉంటాయి. కానీ దీనిని కేవలం వైద్యులు మాత్రమే స్కానింగ్ ద్వారా గుర్తిస్తారు.

Written By: NARESH, Updated On : August 17, 2024 12:39 pm

If you have romance while pregnant, will you get pregnant again

Follow us on

Pregnancy : గర్భం దాల్చిన తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ వస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుందా, లేకపోతే అన్ని జీవుల్లో కూడా ఉంటుందా అని చాలామందికి సందేహం ఉంది. అయితే మహిళలు గర్భం దాల్చిన తర్వాత శృంగారంలో పాల్గొంటే మళ్లీ గర్భం దాల్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ప్రెగ్నెన్సీలో మళ్లీ గర్భం దాల్చడం ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం.

ఓ మహిళలకు కవలలు పుట్టారు. అందులో ఒక శిశువుకు 36 వారాలు వయస్సు ఉంటే, మరో శిశువుకు 34 వారాలు. సాధారణంగా కవలలంటే ఒకే వయస్సు ఉంటుంది. మహా అయితే ఒక నిమిషాలు, గంటల వ్యవధి తేడా ఉంటుంది. కానీ వారాలు ఉండదు కదా. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందనేది చాలామందికి సందేహం ఉండవచ్చు. కానీ ఇలాంటి అరుదైన ఘటన సూపర్ ఫెటేషన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. మహిళ గర్భం దాల్చిన మళ్లీ కొన్ని రోజుల తర్వాత పిండం ఏర్పడితే ఇది సాధ్యమవుతుంది. అంటే ప్రెగ్నెన్సీలో శృంగారంలో పాల్గొంటే మళ్లీ అండం విడుదలై ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ సూపర్ ఫెటేషన్ చాలా రేర్‌గా జరగుతుంది. శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందిన తర్వాత గర్భాశయంలో పిండం నిలుస్తుంది. ఆ తర్వాత కొన్ని వారాలకు మరో శుక్రకణంతో ఇంకో అండం ఫలదీకరణ చెంది గర్భాశయంలోకి వెళ్తుంది. ఇలా పుట్టిన పిల్లలను కూడా కవలలే అంటారు. అయితే వీళ్ల వయస్సులో తేడా ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కవలల ఎదుగుదల ఒకేలా ఉంటుంది. కానీ సూపర్ ఫెటేషన్‌లో పుట్టే పిల్లల ఎదుగుదల వేర్వేరుగా ఉంటుంది.

ఈ సూపర్ ఫెటేషన్ కేవలం మనుషుల్లోనే కాకుండా కుందేళ్ల జాతులు, కొన్ని రకాల చేపల్లో ఎక్కువగా జరగుతుంది. అయితే ఇవి మనుషుల్లో తక్కువగా జరుగుతాయి. లేదంటే కొందరు మహిళలు గర్భధారణ కోసం ఐవీఎఫ్ చేయించుకుంటారు. అలాంటి వాళ్లలో ఇది జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. సూపర్ ఫెటేషన్‌లో డెలివరీ అనేది కష్టంగా ఉంటుంది. ఒక పిండం పూర్తిగా ఎదుగుతుంది. కానీ ఇంకో పిండం ఎదగదు. దీంతో ఒక శిశువు నెలల నిండకముందే డెలివరీ అవుతారు. వీళ్లను కేవలం సిజేరియన్ ద్వారా మాత్రమే ప్రసవం చేయాలి. అయితే నెలలు నిండకముందు డెలివరీ చేయడం వల్ల శిశువు బరువు ఉండరు. దీంతో శ్వాసలో ఇబ్బంది, కదలికల్లో సమస్యలు వస్తాయి.

ఈ రకమైన సంఘటన ఎక్కువగా గర్భధారణ కోసం చికిత్స తీసుకుంటున్న మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్న మహిళల్లో ముందుగా అండం విడుదల అయి ఉండవచ్చు. చికిత్స ద్వారా మళ్లీ అండాన్ని మహిళ గర్భాశయంలోకి విడుదల చేయడం వల్ల అండం ఫలదీకరణం చెందుతుంది. ఇలా ముందే అండం ఉండగా మళ్లీ విడుదల చేయడం వల్ల సూపర్ ఫెటేషన్ జరుగుతుంది. అయితే ఇది మామూలు గర్భం దాల్చిన వాళ్లలాగే సంకేతాలు ఉంటాయి. కానీ దీనిని కేవలం వైద్యులు మాత్రమే స్కానింగ్ ద్వారా గుర్తిస్తారు.