https://oktelugu.com/

Potato: ఆలుగడ్డలు తినేవారందరికీ ఇది హెచ్చరిక.. తింటే మీ ఆరోగ్యం ఇరకాటంలో పడ్డట్లే!

బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల శరీరానికి తగనంత పోషకాలు అందవు. వీటిని కేవలం తక్కువ మోతాదులో మాత్రంమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే మీరు సమస్యల బారిన పడతారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2024 / 01:01 AM IST

    Potato

    Follow us on

    Potato: బంగాళదుంపలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా వీటిని కూరల్లో రోజూ వాడుతారు. కనీసం ఒక బంగాళదుంప అయిన వేయకపోతే కూరకి రుచి ఉండదని భావించి వీటిని ఎక్కువగా వాడుతారు. అయితే బంగాళదుంపలను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా వీటిని తింటే తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయట. వీటిలో పిండి పదార్థాలతో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయిన వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారట. మరి వీటిని అధికంగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం.

    బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల శరీరానికి తగనంత పోషకాలు అందవు. వీటిని కేవలం తక్కువ మోతాదులో మాత్రంమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే మీరు సమస్యల బారిన పడతారు. మధుమేహం ఉన్నవాళ్లు అయితే వీటిని అస్సలు తినకూడదు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. వీటిని రకరకాలు చేసి అమ్ముతున్నారు. ఇష్టం అని ఎక్కువగా వీటిని తిన్నారే అనుకోండి. ఇక మీ సంగతి అంతే. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి. వీటివల్ల బరువు పెరుగుతారు. బంగాళదుంపలను ఉడికించి వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈరోజుల్లో చాలామంది వేపుళ్లు ఎక్కువగా తింటున్నారు. బంగాళదుంపలను బాగా ఫ్రై చేసి తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు అంటున్నారు.

    బంగాళదుంపలను ఎక్కువగా ఫ్రై చేసి తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూతో చేసిన చిప్స్ తినడం తగ్గించాలి. వీటిని పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. వీటివల్ల పిలల్లకు కడుపునొప్పి రావడంతో పాటు ఆకలి తగ్గిపోతుంది. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువగా చేరి గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. బంగాళదుంపల వల్ల హైబీపీ ఎక్కువ అవుతుంది. హైబీపీతో బాధపడుతున్నవాళ్లు వీటికి దూరంగా ఉండటం బెటర్. అయితే వీటిని రాత్రిపూట అస్సలు తినకూడదు. రాత్రిపూట భోజనంతో తినడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. మితంగా కాకుండా ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. కాళ్లు నొప్పులు, వాపు, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని తింటే నొప్పులు అధికం అవుతాయి. వారానికి మూడు కంటే ఎక్కువసార్లు తినకూడదు. అంతగా తినాలనిపిస్తే వీటిని ఉడికించి లేదా స్టీమ్ చేసి తినాలి. అసలు డీప్ ఫ్రై చేసినవి తినకూడదు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నప్పటికీ వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎంత తక్కువగా బంగాళదుంపలను తింటే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి వీటిని రోజూవారి ఆహారంలో తీసుకోవడం తగ్గించండి.