Vishal And Sai Dhanshika Engagement: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశాల్…. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక తమిళ్ తో పాటుగా అతనికి తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ మంచి విజయాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటికే 49 సంవత్సరాల ఏజ్ లో ఉన్న విశాల్ ఎట్టకేలకు సాయి ధన్సిక తో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక సాయి ధన్సిక తన కెరీర్లో చాలా సినిమాలు చేసినప్పటికి ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపైతే రాలేకపోయింది…
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘ కలయర్ సన్’ అనే హీరోతో ప్రేమలో పడి కొద్ది రోజులు డేటింగ్ కూడా చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇటు ధన్సిక కు సక్సెస్ లు లేక, అటు కలయర్ సన్ కి కూడా సక్సెస్ లు రాకపోవడంతో వీళ్లిద్దరి మధ్య కొంతవరకు విబేధాలు వచ్చి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు.
కానీ అప్పటినుంచి ఇప్పటివరకు సాయి ధన్సిక మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోకుండా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు విశాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో ఒకసారిగా తను హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనా వీళ్ళిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక విశాల్ అయితే వీలైనంత తొందరగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన తొందరగా పెళ్లి ముహూర్తాలు వచ్చే విధంగా చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విశాల్ తన ప్రాజెక్టుతో బిజీగా ఉన్నప్పటికి ఇప్పుడు మరికొన్ని సినిమాలను సైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…