https://oktelugu.com/

Food in Rain : వర్షం పడుతుందని వేడి వేడిగా నాన్ వెజ్ తింటున్నారా? ఇక మీ సంగతి అంతే…ఈ సమయంలో నాన్ వెజ్ తినవచ్చా?

ఈ సమయంలో మానవ జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయదట. కాబట్టి తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. అంటే సులువుగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి..జీర్ణం కాని ఆహారం తినడం వల్ల వాంతులు, వికారం లాంటి సమస్యలు వస్తుంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2024 / 07:50 AM IST

    Food in Rain

    Follow us on

    Food in Rain : వెదర్ కూల్ హాట్ హాట్ గా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది కదా. ఏది తింటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. ఇక వర్షంలో స్పైసీగా తింటే ఆ థ్రిల్లే వేరు కదా. కానీ చేసుకోవడం బద్దకం అనిపిస్తుంటుంది. ఇక సిటీలో ఉండే వారు అయితే స్వీగ్గీ జొమాటోల్లో ఆర్డర్ లు పెడుతుంటారు. ఇదెలా ఉంటే నాన్ వెజ్ ప్రియులు ఊరికే ఉంటారా? ఏదో ఒక నాన్ వెజ్ ను వండుకొని తినాల్సిందే. వారానికి ఒకసారి కాదు రెండు మూడు సార్లు అయినా నాన్ వెజ్ ఉండాలి. ముక్క పడాలి ముద్ద దిగాలి అన్నట్టుగా లాగించేస్తుంటారు. కానీ వర్షాకాలంలో నాన్ వెజ్ తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి సమయంలో మన జీర్ణం వ్యవస్థ ఒకే విధంగా ఉండదు. అందుకే కాస్త సీజన్ ను బట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ వర్షాకాలంలో నాన్ వెజ్ తినవచ్చా? లేదా తింటే ఎంత తినాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్ లో కూరగాయలు ఎక్కువగా ఎక్కువ దొరకవు. దొరికినా ఫుల్ రేటు. కాబట్టి నాన్ వెజ్ ను తింటారు చాలా మంది. కానీ వర్షాకాలంలో అలా ఉండదు. మీకు కావాల్సిన ఏ కూరగాయలు అయినా లభిస్తుంటాయి.

    ఇక నాన్ వెజ్ కంటే ఈ సమయంలో కూరగాయలను తినడం ఉత్తమం. ఆరోగ్యాన్ని పెంచే ఈ కూరగాయలను వదిలి, నాన్ వెజ్ తినడం ఎందుకు? అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అంటున్నారు నిపుణులు. ఇక ఈ సమయంలో చేపల జోలికి అసలు వెళ్లకూడదట. ఎందుకంటే వర్షాకాలంలో చేపలకు సంతానోత్పత్తి సమయం ఉంటుంది. అందుకే వాటి శరీరం చాలా మార్పులకు గురవుతుంది. శైవలాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు వీటి శరీరం మీద పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి చేపలను తింటే మీకు ఇన్ఫెక్షన్లతో పాటు అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయట.

    వర్షాకాలంలో వ్యాధి కారక క్రిములు ఎక్కువగా వ్యాపిస్తాయి. కోడిగుడ్లలో ఉండే తేమ క్రిముల వ్యాప్తి మరింత ఎక్కువ అవుతుంది. టైఫాయిడ్ బాక్టీరియా అయిన సాల్మొనెల్లా, ఎశ్చరీషియాకోలు ఎక్కువ వస్తుంటాయి. గుడ్లు ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతాయి. లేదంటే కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.. అందుకే గుడ్లకు దూరంగా ఉండటం కూడా మంచిదే.

    వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా ఈగలు, దోమలు ఫుల్ గా ఉంటాయి. ఇక మటన్ షాప్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చనిపోయిన కోడి మాంసాన్ని కూడా అమ్ముతుంటారు. చికెన్ కొనేటప్పుడు దానిపై మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉంటే తక్కువ రేటుకు ఇచ్చినా సరే వాటిని అసలు తీసుకోవద్దు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. మాంసం జిగటగా లేకుండా మెరుస్తూ, దృఢంగా ఉంటేనే తాజాది అనుకోవాలి. దాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. ఇక దాన్ని వండేటప్పుడు ముందుగా గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి బాగా కడిగాలి. ఇలా చేయడం వల్ల సూక్ష్మజీవులు ఉన్నా కూడా మరణిస్తాయి.

    ఈ సమయంలో మానవ జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయదట. కాబట్టి తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. అంటే సులువుగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి..జీర్ణం కాని ఆహారం తినడం వల్ల వాంతులు, వికారం లాంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో నాన్ వెజ్ కు దూరంగా కూరగాయలకు కాస్త దగ్గరగా ఉండండి. కానీ కూరగాయల్లో కూడా జీర్ణం కాని ఆహారం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్నింటికి దూరంగా ఉండాలి. ఆకుకూరలకు కూడా దూరంగా ఉండాలి అంటారు నిపుణులు. సో మీ మైట్ ను జాగ్రత్తగా మెయింటెన్ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.