Citroen Cars: సిట్రియెన్ నుంచి కొత్త కారు.. ధర తెలిస్తే దిమ్మదిరుగుద్ది.. ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

సిట్రియెన్ నుంచి భారత మార్కెట్లోకి రాబోతున్నబసాల్ట్ ప్రీ ప్రొడక్షన్ గత మార్చిలోనే ప్రారంభించారు. అన్నీ అనుకూలిస్తే ఇది ఆగస్టులో మార్కెట్లోకి తీసుకు రాన్నారు. సిట్రియెను నుంచి రిలీజ్ అయినా సీ3 హ్యచ్ బ్యాక్, ఈసీ 3 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తరువాత బస్టాల్ ను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది క్యూబ్ద్ ప్రొగ్రామ్ కింద రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త సిట్రియెన్ బసాల్ట్ ఆకర్షణీయమైన డిజైన్ ను ఉండనున్నట్లు తెలుస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : July 21, 2024 8:58 am

Citroen Cars

Follow us on

Citroen Cars: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో మారుతి, టాటా, హ్యుందాయ్ లతో పాటు వివిధ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ వరుసలో సిట్రియెన్ కూడా ఉంటోంది. ఫ్రెంచ్ కంపెనీ అయినా సిట్రియెన్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో వివిధ మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో సీ5 ఎయిర్ క్రాస్, ఈసీ 3 వంటివి ప్రముఖంగా ఉన్నాయి. వీటిని భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఆదరించారు. దీంతో ఈ మోడళ్లు ప్రముఖంగా నిలిచాయి. అయితే లేటేస్టుగా సిట్రియెన్ నుంచి కొత్త కారు రాబోతుంది. అదే ‘బసాల్ట్’. ఈ కారు వివరాలల్లోకి వెళితే..

సిట్రియెన్ నుంచి భారత మార్కెట్లోకి రాబోతున్నబసాల్ట్ ప్రీ ప్రొడక్షన్ గత మార్చిలోనే ప్రారంభించారు. అన్నీ అనుకూలిస్తే ఇది ఆగస్టులో మార్కెట్లోకి తీసుకు రాన్నారు. సిట్రియెను నుంచి రిలీజ్ అయినా సీ3 హ్యచ్ బ్యాక్, ఈసీ 3 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తరువాత బస్టాల్ ను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది క్యూబ్ద్ ప్రొగ్రామ్ కింద రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త సిట్రియెన్ బసాల్ట్ ఆకర్షణీయమైన డిజైన్ ను ఉండనున్నట్లు తెలుస్తోంది. సీ3 హ్యాచ్ ఎయిర్ క్రాస్ హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే ఇది స్మార్ట్ డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే హలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ , కూపే వంటి రూప్ లైన్ ను పోలీ ఉంటుంది.

ఈ కొత్త కారు వివరాలు అధికారికంగా వివరాలు వెల్లడించకపోయినపప్పటికీ దీని ఫొటోలను చూస్తే కొన్ని విషయాలు అంచనా వేయొచ్చని అంటున్నారు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయని తెలుస్తోంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ కెమెరా, మానిటర్ సిస్టమ్, టైర్ ప్రెజ్ తో పాటు లేటేస్ట్ టెక్నాలజీతో కూడాని ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. కొన్ని ఫీచర్లు మిగతా కార్ల వలే ఉన్నప్పటికీ ఇప్పటి వినియోగదారుల కోసం అదనంగా కొన్ని చేర్చారు.

బసాల్ట్ ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పవర్, టార్క్ గురించి వివరాలు వెల్లడించలేదు. కానీ 108 బీహెచ్ పీ పవర్ తో పాటు 190 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కారులో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

దేశీయ మార్కెట్లో వివిధ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఫ్రెంచ్ కంపెనీ సిట్రియెన్ నుంచి కొత్త బసాల్ట్ రానున్న నేపథ్యంలో మిగతా కార్లకు పోటీ ఇస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. అయితే లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు ధర విషయంలో మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. అయితే ధర గురించి కంపెనీ ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటి వరకు ఉన్న సీ3 హ్యాచ్ బ్యాక్ 5 సీటర్ రూ. 10 లక్షల లోపు విక్రయించారు. కానీ బసాల్ట్ రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎస్ యూవీ వేరియంట్ లో వస్తున్న ఈ కారు ఇప్పుడు మార్కెట్లో ఇదే వేరియంట్లకు గట్టి పోటీ ఇస్తుందన్న చర్చ సాగుతోంది. మరి మార్కెట్లోకి వచ్చిన తరువాత బసాల్ట్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.