Trivikram – Allu Arjun : ఫ్యామిలీ చిత్రాలకు త్రివిక్రమ్ చెక్.. బన్నీ తో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్.. లీక్ చేసిన బన్నీ వాసు..

మరి ఈ మూవీలో హీరోయిన్, ఇతర తారాగణం ఎవరు ఉంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ యాక్షన్ తో కూడుకొని ఉంటుందా? లేక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీనా? అని చర్చించుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : July 21, 2024 7:40 am

Trivikram - Allu Arjun

Follow us on

Trivikram – Allu Arjun : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే మాయలు వేరు. సినీ ఇండస్ట్రలోకి వచ్చిన కొత్తలో తన డైలాగ్స్ ఆకట్టుకున్న ఆయన ఆ తరువాత విభిన్న చిత్రాలు తీసి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలు తక్కువ బడ్జెట్ లో ఉంటాయి. కేవలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో ఉండే సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తన కట్టు తెంపనున్నాడు. ఇక నుంచి భారీ బడ్జెట్ సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు తేటతెల్లం చేశాడు. త్వరలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ లకాంబినేషన్లో వస్తున్న మూవీ భారీ బడ్జెట్ తో ఉండనుందని చెప్పడంతో సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహ నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

రెండు ఇళ్లు, కొన్ని క్యారెక్టర్స్, కొన్ని కార్ల డ్యామేజ్.. త్రివిక్రమ్ సినిమాలో ఇవి మాత్రమే కనిపిస్తాయి. వీటిలో ఎన్నో ఎమోషన్స్, కామెడీ అన్నీ కలగలిపి మొత్తంగా తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడం త్రివిక్రమ్ స్టైల్. అందుకే కొందరు నిర్మాతలు త్రివిక్రమ్ తో సినిమాలు తీయాలని వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనే సొంత బ్యానర్ పై కొన్ని సినిమాలు తీశాడు కూడా. అయితే ఇప్పుడు ఆయన తన స్టైల్ ను మార్చబోతున్నాడు. ఐకాన్ స్టార్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల మధ్య మూడు సినిమాలు వచ్చాయి. వీటలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం.. ఈ మూడు సినిమాల్లో ఎక్కడా ఖర్చు కనిపించదు. కానీ ఇవి ఆకట్టుకున్నాయి. ఎక్కువగా పవన్ కల్యాణ్ తో సినిమాలు తీసే తివిక్రమ్ బన్నీతో సైతం బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యలో మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో అల్లు అర్జున్ తో ఈ సినిమా ఉంటుందని నిర్మాత బన్నీ వాసు చెప్పాడు. ఇటీవల బన్నీ వాసు ‘ఆయ్’ అనే సినిమా ఫంక్షన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని చెప్పాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నాడు. పుష్ప 1,2 సినిమాలతో ఈ హీరో ఖరీదైన హీరోగా మారిపోయాడు. దీంతో పుష్ప 2 తరువాత వెంటనే త్రివిక్రమ్ ఈ మూవీకి ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెనువెంటనే భారీ చిత్రాలు రావడంతో అల్లు రేంజ్ కు తగ్గకుండా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. సినిమా ఫైనాన్ష్ కోసం పెద్ద పెద్ద సంస్థలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చిన త్రివిక్రమ్ ఆ తరువాత బన్నీతో ఉంటుందని ప్రకటించారు. అయితే పాత సినిమాల్లోలాగే ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ లేటేస్ట్ గా బన్నీ వాసు భారీ బడ్జెట్ చిత్రం అనడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మూవీ అగస్టులోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. డిసెంబర్ కు వాయిదా పడింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా మేకింగ్ అవుతుందని అంటున్నారు. మరి ఈ మూవీలో హీరోయిన్, ఇతర తారాగణం ఎవరు ఉంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ యాక్షన్ తో కూడుకొని ఉంటుందా? లేక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీనా? అని చర్చించుకుంటున్నారు.