Health Tips: యవ్వనంగా ఉండాలంటే వీటిని తినండి..

ఆకుకూరల్లో చర్మానికి కావాల్సిన విటమిన్స్ ఎ, సి, కెలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ రక్తప్రసరణను పెంచుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది.

Written By: Swathi, Updated On : June 9, 2024 5:16 pm

Health Tips

Follow us on

Health Tips: ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ చాలా కష్టం కదా.

కొన్ని ఆహారాలు తినడం వల్ల ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. మరి అవేంటో చూసేద్దాం.

ఆకుకూరల్లో చర్మానికి కావాల్సిన విటమిన్స్ ఎ, సి, కెలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ రక్తప్రసరణను పెంచుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది.

దానిమ్మ పండ్లలో ఉండే అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి ముడతలను తగ్గించడానికి దానిమ్మ ఉపయోగపడుతుంది.

కండరాల బలహీనత కారణంగానే శరీరం బలం కోల్పోతుంది. దీనివల్ల చర్మం జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. అందుకే శరీరంలో కండరాలను దృఢంగా ఉంచడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

బ్రకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో చర్మాన్ని అందంగా యవ్వనంగా ఉంచేందుకు దోహదపడతాయి.

టమాట తింటే కూడా చర్మం యవ్వనంగా ఉంటుంది. టమాటాలను ఉడికించి, పచ్చిగా, సలాడ్ చేసుకొని తినాలి. ఏ రూపంలో అయినా తినవచ్చు.

అవకాడోలో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. వీటిని తరచు తినడం వల్ల యంగ్ గా కనిపిస్తారు.

నట్స్ లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లతో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మ సమస్యలను తగ్గించి ముడతలను మాయం చేస్తాయి. దీంతో నిత్యం యవ్వనంగా ఉంటారు.