Clothes Dry Without Sun: వర్షాకాలంలో బట్టలు ఆరడం పెద్ద టాస్క్. దీన్ని తీర్చడం కూడా పెద్దపనే. మరి బట్టలు ఆరాలంటే ఏం చేయాలి. ఎండాకాలంలో అయితే ఇలా వేయగానే అలా ఎండిపోతాయి. కానీ వర్షాకాలంలో ఉండే తేమకు బట్టలు అసలు ఆరవు. బట్టలు ఆరకపోతే ఎలాంటి స్మెల్ వస్తాయో చెప్పాల్సిన పనిలేదు. మీ ముక్కులు బాగానే పని చేస్తున్నాయి కదా. వామ్మో ఇలాంటి బట్టల వద్ద మాత్రం మీ ముక్కును పరీక్షించకండి. మరి ఈజీగా బట్టలు ఆరాలంటే ఏం చేయాలో తెలుసా?
బట్టల్ని అన్నింటినీ ఒకేసారి ఆరవేయకండి. చాలా గ్యాప్ ఇస్తూ ఆరబెట్టాలి. ఒకేసారి ఎక్కువ ఆరవేస్తే బట్టలు త్వరగా ఆరవు. ఇక ఐరన్ చేస్తే కూడా బట్టల్ని సులభంగా ఆరబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బట్టలు పొడిగా అవుతాయి కానీ ఎక్కువ తడి ఉన్న బట్టలపై ట్రై చేయొద్దు. అయితే మరో విషయం ఏంటంటే తడి బట్టలు ఆరేసేందుకు టవల్స్‌ని కూడా వాడొచ్చు. ఇందుకోసం టవల్స్ వేసి తర్వాత అందులో ఆరబెట్టే బట్టలు వేస్తే సరిపోతుంది.
ఇందులో ఉన్న నీరును టవల్ పీల్చుకుంటుంది. తర్వాత రెండింటిని ఆరబెట్టేస్తే సరిపోతుంది. రూమ్‌లో బట్టలు ఆరేసి ఫ్యాన్ వేయడం మరో సూపర్ ఆలోచన. ఇలా బట్టలు ఆరబెట్టడానికి టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఏదైనా వాడండి. దీంతోపాటు, వర్షం పడినప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల గాలి వస్తుంది. ఆ గాలికి ఎదురుగా బట్టల్ని ఆరేస్తే సరిపోతుంది.
హెయిర్ డ్రైయిర్‌ని ఉపయోగించి కూడా బట్టల్ని ఆరేసుకోవచ్చు. ఈ ఎయిర్ డ్రయర్ వల్ల అర్జెంట్ గా ఉన్న బట్టల్ని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. కానీ, లో టెంపరేచర్‌లో ఆరబెట్టడం ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా, డీహ్యుమిడిఫైయర్ వాడితే గాలిలో తేమ త్వరగా ఆరిపోయి.. పొడిగా మారతాయి. కాబట్టి, హ్యాపీగా వీటిని వాడి బట్టల్ని ఆరబెట్టండి. మరో విషయం ఏంటంటే ఇంట్లోనే బట్టలు ఆరబెట్టాలంటే డ్రైయింగ్ రాక్, క్లాత్ లైన్ లు కూడా వాడవచ్చు. దీనిని మనం ఇంట్లోనే వెలుతురు, గాలి వచ్చే స్థలంలో పెట్టి ఆరబెట్టుకోండి.