Curd: కడుపు చల్లగా ఉండటానికి పెరుగు చాలా ఉపయోగపడుతుంది. పెరుగుతో ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్నందున శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే పెరుగుతో కలిపి మాత్రం కొన్ని ఆహారాలు తినకూడదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మరి అవేంటో ఓ సారి చూసేద్దామా..
కొందరు చేపలు వండుతున్నప్పుడు అందులో పెరుగు వేస్తారు. లేదా తిన్న తర్వాత పెరుగు తింటారు. కానీ ఇలా అస్సలు తినకూడాదు. ఇవి రెండు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. అలెర్జీలు, దద్దుర్లు, ఇతర సమస్యల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది ఈ మిశ్రమం.
కొన్ని సార్లు పెరుగు పుల్లగా ఉంటుంది. ఇలాంటి పెరుగును నారింజ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతో కలిపి తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు నొప్పివంటి సమస్యలను కలిగిస్తుంది. పెరుగు, ఉడికించిన గుడ్డు కలిపి కూడా అసలు తీసుకోవద్దు. ఈ రెండూ ప్రొటీన్‌ను అందిస్తాయి. కానీ వీటిని కలిపి తింటే జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి, పొత్తికడుపు భారాన్ని, గ్యాస్‌ను కలిగిస్తుంది.
ఉల్లిపాయ, పెరుగు మిశ్రమాన్ని కూడా నివారించడమే బెటర్. ఈ కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీసి.. కడుపులో చికాకు, గ్యాస్, ఇతర సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇక రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫం ఎక్కువ అవుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు వస్తాయి.. పెరుగు, మామిడికాయలు కలిపి తింటే బాగుంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మాత్రం ఎంత మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడి జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.