Homeహెల్త్‌Health Tips : కలయిక తర్వాత ఈ మిస్టేక్స్ చేస్తే.. సమస్యలను కొని తెచ్చుకున్నట్లే!

Health Tips : కలయిక తర్వాత ఈ మిస్టేక్స్ చేస్తే.. సమస్యలను కొని తెచ్చుకున్నట్లే!

Health Tips :  భార్యాభర్తలు మధ్య బంధం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండటంతో పాటు ఫిజికల్‌ బాండ్ కూడా బాగుండాలి. శృంగార చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. కలయిక తర్వాత కొందరికి భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం అన్నీ విషయాలు అప్డేట్ అవుతున్నాయి. కానీ కలయిక విషయంలో మాత్రం మనుషుల ధోరణి మారడం లేదు. ఎవరైనా వెంటే ఏమనుకుంటారో అనే భయంతో దీని గురించి ఎవరూ బయట పెద్దగా మాట్లాడుకోరు. కొందరు మహిళలకు తెలియక కలయిక తర్వాత చిన్న జాగ్రత్తలు పాటించకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. కలయిక తర్వాత ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయవద్దు.

యోనిని శుభ్రం చేసుకోవడం
కేవలం కలిసిన తర్వాత మాత్రమే కాకుండా బాత్‌రూమ్ వెళ్లిన ప్రతిసారి మహిళలు యోనిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. యోని ఎప్పుడు తేమగా ఉండేలా కాకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడు తేమ ఉండటం వల్ల బ్యాక్టీరియా ఉండిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడూ యోనిని క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల సమస్య తగ్గుతుంది.

వాసన వస్తే నిర్లక్ష్యం వద్దు
సాధారణంగా యోని వాసన ఉంటుంది. కలయిక తర్వాత ఇది ఎక్కువైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. శృంగారంలో పాల్గొనడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మర్చిపోవద్దు.

నీరు తాగాలి
కలయిక తర్వాత తప్పకుండా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటర్ ఎక్కువగా తాగి, మూత్ర విసర్జన చేస్తే బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. అందుకే కలయిక తర్వాత గ్లాసు మంచినీరు అయిన తాగండి.

మూత్ర విసర్జన
ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత మూత్ర విసర్జన చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలయిక తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ సమస్యను తగ్గిస్తుంది. కలయిక సమయంలో బ్యాక్టీరియా యోనిలోకి చేరితే మూత్ర విసర్జన ద్వారా బయటకు వస్తుంది. దీనివల్ల ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావు.

శుభ్రత ముఖ్యం
కలయిక తర్వాత చాలామంది చేసే తప్పు శుభ్రత పాటించకపోవడం. ఇద్దరు కలిసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. శృంగారంలో పాల్గొన్న తర్వాత తప్పకుండా శుభ్రత పాటించాలి.

టైట్ దుస్తులు ధరించకూడదు
కలయిక తర్వాత స్త్రీలు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల యోనిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి.

కలయిక తర్వాత ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. లేకపోతే యూరీనరీ ట్రాక్ట్ సమస్యలు, సుఖ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ చిన్న తప్పులు చేయడం వల్ల ఈ మధ్య యువత ఎక్కువగా సుఖ వ్యాధులకు బలైవుతున్నారు. కాబట్టి కలయిక తర్వాత ఈ తప్పులు చేయవద్దు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper