Gay Divorce : హిందూ సంప్రదాయంలో వివాహ బంధానికి ఎంతో విలువ ఉంది. భార్యాభర్తలు జీవితాంతం సంతోషంగా కలిసి జీవించాలని వేదమంత్రాల సాక్షిగా పచ్చని పందిరిలో పెళ్లి చేస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చిన ఒకరినొకరు అర్థం చేసుకుని సంసార సాగరాన్ని దాటాలని దీవిస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన సరే.. జీలకర్ర, బెల్లంలా భాగస్వామితో ఉండాలి. ఆ చిటికెన వేలును మధ్యలో వదిలేయకుండా జీవితాంతం పట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఈరోజుల్లో వివాహ బంధానికి అసలు విలువ లేకుండా పోతుంది. ప్రేమ లేదా పెద్దల కుదిర్చిన వివాహం అయినా సరే కొద్ది రోజుల తర్వాత విడిపోతున్నారు. సాధారణంగా ఎక్కువమంది పెళ్లయి రెండు, మూడేళ్లు తర్వాత సెట్ కాకపోతే విడాకులు తీసుకోవడం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం గో డైవోర్స్ సంఖ్య పెరిగిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకీ గో డైవోర్స్ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
జీవితాంతం సంతోషంగా ఉండాల్సిన వాళ్లు ముప్ఫై ఏళ్ల తర్వాత వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. పిల్లలకు పెళ్లి చేసి వాళ్ల బాధ్యతలు తీర్చిన తర్వాత భాగస్వామి నుంచి విడాకులు కోరుకుంటున్నారు. ఇలా 50 నుంచి 60 వయస్సు మధ్య ఉన్న జంటలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. బాధ్యతలన్నీ తీరిన తర్వాత ముప్ఫై ఏళ్ల తర్వాత విడాకలు తీసుకున్న వాళ్లనే గో డైవోర్స్ అంటారు. ప్రస్తుతం ఈ రకమైన విడాకులు ఎక్కువయ్యాయని ఓ అధ్యయనం తెలిపింది.
గో డైవోర్స్ కావడానికి ముఖ్యకారణం భార్యాభర్తలు సంసార జీవితంలో తృప్తి చెందలేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. పెళ్లయిన కొత్తలో ఉన్న ప్రేమ, గౌరవం, నమ్మకం లేకపోవడం కూడా దీనికి ఓ కారణం. ఇద్దరు కలిసి ఉండాలంటే ఒకరు మంచిగా ఉంటే సరిపోదు. ఇద్దరూ ఉండాలి. అప్పుడే ఆ బంధం జీవితాంతం ఉంటుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నీ తీరిపోయాయి.. పిల్లలు సెటిల్ అయిపోయారు. పెళ్లిళ్లు అయిపోయాయని.. వాళ్లకు చెప్పాల్సిన పెద్దలే విడాకులు తీసుకుంటున్నారు.
గో డైవోర్స్‌కి ముఖ్య కారణం ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడమే. దంపతుల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు కలిసి కూర్చోని క్లియర్ చేసుకోవాలి. కానీ చాలామంది గొడవ తర్వాత క్లియర్ చేసుకోకుండా ఉంటారు. దీనివల్ల భాగస్వామిలో ఒకరికైనా సంతోషంగా ఉండరు. గతంలో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుంటూ గొడవులు మొదలవుతాయి. చిన్న గొడవులు కాస్త విడాకుల వరకు వెళ్తాయి. ఈ గొడవులను దాటి అర్థం చేసుకునే వాళ్లు కొందరైతే.. విడాకులు కోరేవాళ్లు కొందరుంటారు. పాతవన్నీ తీసి గొడవ చేస్తుంటారు. ఈ టైప్ మైండ్‌సెట్ దంపతులలో ఒకరికి ఉన్న ప్రాబ్లమే. గొడవులు అనేవి కామన్. గతాన్ని మర్చిపోవాలి. కానీ అలా చేయకుండా ప్రతీసారి పాతవి తీయడం వల్ల గొడవ పెరిగ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఇలా వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించుకుని అక్కడే వదిలేయాలి. గతాన్ని పట్టుకుని గొడవలు పడటం కంటే వాటిని మర్చిపోతే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Increasing number of gay divorced couples
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com