Dondakaya
Dondakaya : దొండకాయ పేరు వింటే చాలు చాలా మంది ఎక్కువగా ముఖం చిట్లించుకుంటారు. వామ్మో ఆ కర్రీనా బాబు మాకు వద్దు అంటారు. పెద్దగా ఇష్టపడరు. కానీ దొండకాయ వేపుడు, పచ్చడిని కొంతమంది ఇష్టంగా తింటారు. కానీ మీకు దొండకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఏది పెట్టినా తింటారు. ఎందుకంటే ఇందులో ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి , పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. మరి ఆహారంలో ఈ దొండకాయను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
మధుమేహాన్ని నిర్వహించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. దీన్ని కుండ్రు అని కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేద ఔషధాలలో గ్లూకోస్ టాలరెన్స్‌ని పెంచడం ద్వారా, దాన్ని ఉడికించిన, పచ్చి ఆకుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహం చికిత్సకు ఉపయోగిస్తారు. ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది ఈ దొండకాయ.
మధుమేహానికి ఔషధంగా ఆయుర్వేదంలో దొండకాయను ఉపయోగిస్తారు. దీనిలోని యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. దొండకాయ, దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుతాయి. ఇక షుగర్ పేషెంట్స్ వారంలో ఒక రోజు దొండ కాయ తినాలి. లేదంటే దొండ ఆకుల రసం తాగినా చాలా మంచిది అంటున్నారు నిపుణులు.
ఈ దొండకాయలో థయామిన్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్‌లను గ్రూకోజ్‌గా మార్చే మంచి పోషకం ఈ దొండకాయి. శరీరంలో శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచడమే కాదు జీవక్రియను నియంత్రిస్తుంది. దొండకాయలోని థయామిన్ రక్త ప్లాస్మాలోకి వెళ్తుంది. ఈ దొండకాయ మరింత శక్తిని ఉత్పత్తి చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. అయితే ఈ థయామిన్ ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తుంది. రక్తహీనత తగ్గుతుంది.
స్థూలకాయన్ని నిరోధించే గుణాలు కూడా ఈ దొండకాయలో ఉన్నాయి. కీ అడిపోజెనిక్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫ్యాక్టర్-PPARγ డౌన్ – రెగ్యులేషన్ ద్వారా దొండకాయల డిఫరెన్సియేషన్‌ను నిరోధించేలా సహయ పడుతుంది. అంతేకాదు ప్రీ – అడిపోసైట్‌లపై నేరుగా పని చేసేలా చేస్తుంది. ఇది శరీర బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. ఇక ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అల్సర్లు, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది దొండకాయ. కాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఇందులో బేటా కెరోటిన్ ఉంటుంది. ఇది కాస్త విటమిన్- ఏగా రూపాంతరం చెందుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆస్తమాను నివారిస్తుంది అంటున్నాయి అధ్యయనాలు.