Hair grow : గుండు కొట్టిస్తే జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుందా?

ప్రతి ఒక్కరికి ప్రస్తుతం వెంట్రుకల సమస్య మరింత పెరుగుతుంది. కొందరికి జుట్టు ఊడిపోవడం, తెల్లగా మారడం, ఊడిన ప్రాంతంలో కొత్త జుట్టు రాకపోవడం, చుండ్రు రావడం వంటి చాలా సమస్యలు ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్నాయి. ఈ సమస్య మగవారిలో కూడా కనిపిస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుంటే పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే పిల్లలకు కొంత వయసు వచ్చాక కూడా గుండు కొట్టిస్తుంటారు తల్లిదండ్రులు. అలా జుట్టు పూర్తిగా తొలగిస్తే నెక్ట్స్ మరింత బలమైన, పట్టులాంటి జుట్టు వస్తుందని నమ్మకం.

Written By: Srinivas, Updated On : October 19, 2024 9:02 am

Does shaving make hair grow thicker?

Follow us on

Hair grow : ఇక పిల్లలు ఎంత మారాం చేసినా, ఈ విషయంలో పేరెంట్స్ వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఉంటారు. కొంతమంది తొలి జుట్టును మొక్కుగా చెల్లించడం కూడా చూస్తుంటాము. అంతేకాదు జుట్టు సమస్యలు ఉన్నా సరే కొందరు గుండు కొట్టించుకోవడం కామన్. ఎందుకంటే.. వారి జుట్టులో రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది. దాని వల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే గుండు కొట్టించేసుకుంటే, ఇక ఏ సమస్యా ఉండదు కాబట్టి గుండు కొట్టించుకోవడం బెటర్ అనుకుంటారు.  ఆ తర్వాత కూడా కొత్త జుట్టు.. మంచిది వస్తుంది అనుకుంటారు.  కారణాలు ఏవైనా సరే, గుండు కొట్టిస్తే, నెక్ట్స్ వచ్చే జుట్టు బాగా పెరుగుతుందా, లేదా అని మీకు కూడా అనుమానం ఉందా?. ఓ సారి ఈ ఆర్టికల్ చదివి క్లారిటీ తెచ్చుకుందాం.

గుండు కొట్టించుకుంటే మృత వెంట్రుకల కణాలు పూర్తిగా తొలగిపోతాయి. వెంట్రుకలు పెరిగే హెయిర్ ఫోలికల్ చర్మం కింద ఉంటుంది. అయితే గుండు తర్వాత పెరిగే వెంట్రుకలు సూర్యరశ్మికీ లేదా ఇతర రసాయనాలకు గురి అవవు.అందుకే  జుట్టు గుండు కొట్టించిన తర్వాత, ముందు కంటే నల్లగా కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా జుట్టు మరింత నల్లగా కనిపిస్తుంది కాబట్టే.. జుట్టు బాగా పెరిగినట్లు అనిపిస్తుంది అంటున్నారు కొందరు.

గుండు కొట్టించడం వల్ల మరింత ఒత్తుగా పెరుగుతాయనే శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ నమ్మకం మాత్రం ఉంది. అయితే ఒక వ్యక్తి జుట్టు సాంద్రత అతని జన్యువులను బట్టీ పెరుగుతుంది. గుండు కొట్టించినంత మాత్రాన జన్యు లక్షణాల్లో మార్పు రావని నిపుణులు అంటున్నారు.  అయితే ఎక్కువ సార్లు షేవింగ్ చేస్తే మాత్రం జుట్టు సాంద్రత పెరుగుతుందని పెన్సిల్వేనియా యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే ఇది తాత్కాలికమే. జుట్టు పెరిగేకొద్దీ సాంద్రత కూడా తగ్గుతుంది. కాబట్టి గుండు కొట్టించిన తర్వాత జుట్టు బాగా పెరుగుతుందనే ఆలోచన పూర్తిగా తప్పే అంటున్నారు నిపుణులు.

గుండు కొట్టించడం వల్ల చక్కటి వెంట్రుకలు లేదా మందపాటి వెంట్రుకలు అయితే రావు అని టాక్. జుట్టు రంగు మందంగా కనిపించినప్పటికీ, అది తాత్కాలికమే. అయితే సాంద్రతను మాత్రం జుట్టు తిరిగి పొందుతుంది. జుట్టు బాగా పెరిగేందుకు.. తగిన ఆహారం, లైఫ్‌స్టైల్ మెయింటేన్ చేయడం అవసరం. గుండు కొట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తలపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గించుకోవచ్చు.