Bigg Boss Telugu 8: రోజు రోజుకి టాస్కులలో రాక్షసంగా ఆడుతున్న నిఖిల్..మొన్న మణికంఠ..నేడు నయనీ పావని..తృటిలో తప్పిన ప్రమాదం!

నాగార్జున ఒక వారం చాలా బలమైన వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తన ఆట తీరుని మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు పృథ్వీ స్థానంలోకి నిఖిల్ వచ్చి చేరాడు. ఈయన ఈమధ్య టాస్కులు ఆడే విషయం లో రాక్షసంగా వ్యవహరిస్తున్నాడు. ప్రభావతి ఎగ్స్ టాస్కులో ఈయన డ్రామా కంఠ అలియాస్ మణికంఠ ని విసిరి అవతలకు వేస్తాడు.

Written By: Vicky, Updated On : October 19, 2024 8:51 am

Bigg Boss Telugu 8(133)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో నిఖిల్ పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. టాస్కులు ఆడడం లో కానీ, తోటి కంటెస్టెంట్స్ తో స్నేహంగా మెలగడంలో కానీ, టీం ని గొప్పగా లీడ్ చేయడంలో కానీ, ఎంటర్టైన్మెంట్ అందించడంలో కానీ, ఇలా అన్ని విషయాల్లో ఆయన ది బెస్ట్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈమధ్య ఈయన టాస్కులు ఆడే విషయంలో బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ ని తలపిస్తున్నాడు. ఆయన టాస్కులు ఆడే విషయంలో చాలా రాక్షసంగా వ్యవహరించేవాడు, కంటెస్టెంట్స్ కి చాలా తీవ్రమైన గాయాలు తగిలేవి. అతన్ని కంట్రోల్ చేయడం కోసం నాగార్జున ఒక వారం ఆయనకి ఎల్లో కార్డు వార్నింగ్ ఇస్తాడు.

ఈ సీజన్ ఆరంభం లో పృథ్వీ కూడా అలాగే ఆడేవాడు, కానీ నాగార్జున ఒక వారం చాలా బలమైన వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తన ఆట తీరుని మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు పృథ్వీ స్థానంలోకి నిఖిల్ వచ్చి చేరాడు. ఈయన ఈమధ్య టాస్కులు ఆడే విషయం లో రాక్షసంగా వ్యవహరిస్తున్నాడు. ప్రభావతి ఎగ్స్ టాస్కులో ఈయన డ్రామా కంఠ అలియాస్ మణికంఠ ని విసిరి అవతలకు వేస్తాడు. పాపం డ్రామాకంఠ కి ఆరోజు ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. ఒకానొక సందర్భంలో నిఖిల్ ‘మనమంతా ఆర్టిస్టులంరా, ఫిజికల్ అయ్యి దెబ్బలు తగిలి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి’ అని చెప్పుకొచ్చాడు. కానీ అదే నిఖిల్ డ్రామాకంఠ ని విసిరి అవతల వేసాడు, మొన్న గౌతమ్ ని వాష్ రూమ్ నుండి మెడ పట్టుకొని గుంజుకుంటూ బయటకి తీసుకొచ్చాడు, నిన్న జరిగిన బాటన్ టాస్క్ లో పాపం నయనీ పావని ని గింగిరాలు తిప్పేసాడు. అతను ఆమెని ఈడ్చుకుంటూ వచ్చిన తీరుని చూస్తే చెయ్యి లేదా కాళ్ళు విరిగిపోతాయి అని భయపడ్డారు తోటి హౌస్ మేట్స్. టాస్క్ లో లీనమై నిఖిల్ తనని తాను మర్చిపోయాడు, ఎలా పడితే అలా క్రూరంగా ఆడేస్తున్నాడు.

ఇలాగే ఆయన ఆడితే మాత్రం రాబోయే రోజుల్లో ఎదో ఒక కంటెస్టెంట్ కి దెబ్బలు తగిలి చాలా సీరియస్ అయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో నాగార్జున కచ్చితంగా నిఖిల్ ఆట తీరుకి అడ్డుకట్ట వేయాల్సిందే, లేకపోతే రాబోయే రోజుల్లో అనర్హం జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం నిఖిల్ ఆట తీరు బాగానే ఉంది, సోనియా వెళ్లిపోయిన తర్వాత నిఖిల్ లో విన్నర్ లక్షణాలు వచ్చాయి. కానీ ఆటలో ఆవేశం ఒక్కటి తగ్గించుకుంటే నిఖిల్ ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో ఇది ఆయన మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన నిఖిల్, ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.