Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram: మాటిచ్చాడు, నిలబెట్టుకున్నాడు.. కిరణ్ అబ్బవరం చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు

Kiran Abbavaram: మాటిచ్చాడు, నిలబెట్టుకున్నాడు.. కిరణ్ అబ్బవరం చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు

Kiran Abbavaram: అక్టోబర్ 18న లవ్ రెడ్డి టైటిల్ తో ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ విడుదలైంది. ఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించారు. స్మరన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఒక యదార్థ ఘటన ఆధారంగా లవ్ రెడ్డి తెరకెక్కినట్లు సమాచారం. కాగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి హీరో కిరణ్ అబ్బవరం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక హామీ ఇచ్చాడు. లవ్ రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకులకు ఫ్రీగా చూపిస్తామని వెల్లడించారు.

కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఉచితంగా ప్రదర్శించడం అంటే సాహసమే. కిరణ్ అబ్బవరం ఏదో ప్రచారం కోసం చెబుతున్నాడని అందరూ భావించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం లవ్ రెడ్డి మూవీ ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. నాలుగు నగరాల్లో 4 ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ నగరాల్లో ఈ షోలు ఏర్పాటు చేయడమైంది. ఇక కిరణ్ అబ్బవరం సాహసానికి అందరూ షాక్ అవుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు భేష్ అని పొగుడుతున్నారు. లవ్ రెడ్డి మూవీకి పాజిటివ్ టాక్ దక్కడం విశేషం. ఈ మూవీ కథ పరిశీలిస్తే… ముప్పై ఏళ్ళు వచ్చినా హీరోకి పెళ్లి కాదు. చాలా సంబంధాలు చూస్తాడు. కానీ తనకు ఒక్క అమ్మాయి కూడా నచ్చదు. అయితే హీరోయిన్ ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమె ప్రేమను పొంది వివాహం చేసుకోవాలని అనుకుంటాడు.

మరోవైపు హీరోయిన్ తండ్రి తన కూతురిని గవర్నమెంట్ ఉద్యోగికి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో అడ్డదారిలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటాడు. రూ. 15 లక్షలు ఒక వ్యక్తికి లంచం ఇస్తాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో హీరోకి కష్టాలు మొదలవుతాయి. ఇంతకీ హీరో ప్రేమ గెలిచిందా? హీరోయిన్ ని దక్కించుకున్నాడా? అనేది మిగతా కథ..

ఇక కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు మూవీతో హీరోగా మారాడు. ఎస్ ఆర్ కళ్యాణమండపం టైటిల్ తో చేసిన మూవీ మంచి విజయం అందుకుంది. తర్వాత కిరణ్ అబ్బవరం కి మంచి హిట్ పడలేదు. ఆయన వివిధ రకాల జోనర్స్ ట్రై చేశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కా టైటిల్ తో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. కా పాన్ ఇండియా మూవీగా భారీగా విడుదల కానుంది. కా మూవీ దీపావళి కానుకగా విడుదల కానుంది.

Exit mobile version